Homeజిల్లాలుశ్రీ సత్యసాయిరిటైర్డ్ పి.ఈ.టి గోవర్ధన్ గౌడ్ ఆకస్మిక మృతి..

రిటైర్డ్ పి.ఈ.టి గోవర్ధన్ గౌడ్ ఆకస్మిక మృతి..

- Advertisement -

సంతాపం తెలిపిన పాఠశాల ఉపాధ్యాయ సంఘం నాయకులు
విశాలాంధ్ర ధర్మవరం;; పట్టణంలోని కొత్తపేటలో గల ఎస్ పి సి ఎస్ ప్రభుత్వ మున్సిపల్ బాలుర ఉన్నత పాఠశాలలో కోషిని గోవర్ధన్ గౌడ్ పి ఈ టి గా విధులు కొనసాగించి, రిటైర్డ్ అయ్యారు. అనంతరం కొద్ది రోజులుగా ఊపిరితిత్తుల సమస్యతో వారు అనారోగ్యానికి గురయ్యారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులు గోవర్ధన్ గౌడ్ ని బెంగళూరులోని సెయింట్ జాన్స్ హాస్పిటల్ లో చేర్పించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందడం జరిగిందని కుమారులు తెలిపారు. ఈ సందర్భంగా వారి స్వగృహం అయిన ధర్మారంలోని యాదవ వీధిలో గల వారి ఇంటికి పట్టణంలోని మున్సిపల్ పాఠశాలల ఉపాధ్యాయులు, రిటైర్డ్ టీచర్స్, ఎంఈఓ లు, హెడ్మాస్టర్లు, కుటుంబ బంధుమిత్రులు చేరుకొని పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం వారు పాఠశాలకు చేసిన సేవలను కొనియాడుతూ, గోవర్ధన్ గౌడ్ మృతి తీరని లోటు అని తెలిపారు. అంతేకాకుండా పాఠశాలలో విధులలో ఉన్నప్పుడు పాఠశాల లోని విద్యార్థులకు వివిధ రకాలైన స్పోర్ట్స్ గేమ్స్ నేర్పిస్తూ ఎన్నో రకాలుగా పోటీలలో విజేతలై పాఠశాలకే వన్నెతెచ్చారని వారు తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు