యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్ ఉద్యోగుల సంఘం నాయకులు
సెప్టెంబర్ 28, 29, 30 బ్యాంకుల సమ్మె
విశాలాంధ్ర ధర్మవరం;;దేశవ్యాప్తంగా బ్యాంకు ఉద్యోగుల సమ్మె పిలుపుమేరకు ధర్మవరం పట్టణంలోని అన్ని బ్యాంకుల ఉద్యోగస్తులు మరోసారి అనగా సెప్టెంబర్ 28, 29, 30 (మూడు రోజులు) రెండవసారి సమ్మెను నిర్వహిస్తున్నట్లు పట్టణ యు. ఎఫ్. బి. యు కన్వీనర్ గోపాల్ నాయక్, ఆఫీసర్ రీజినల్ యూనియన్ కార్యదర్శి ఉమామహేశ్వర వర్ధన్, ట్రేడ్ యూనియన్ రీజినల్ కార్యదర్శి రాజశేఖర్ తెలిపారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మొదటి సమ్మెను సెప్టెంబర్ 11వ తేదీన నిర్వహించిన, ఫలితం లేదని తెలిపారు. తిరిగి రెండవసారి మూడు రోజుల సమ్మె బాటను నిర్వహిస్తున్నామని తెలిపారు. ప్రభుత్వం ఏకపక్ష నిర్ణయంతో బ్యాంకు ఉద్యోగస్తులకు అన్యాయం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. వర్గ విభేదాలు లేకుండా సమతుల్యత కూడినటువంటి న్యాయం జరగాలని వారి డిమాండ్ చేశారు. ద్వైపాక్షిక ధోరణిలో అసోసియేషన్ నాయకులతో చర్చలు జరిపి న్యాయం చేకూర్చేలా కృషి చేయాలని తెలిపారు. ఇచ్చిన హామీ మేరకు బ్యాంకుల్లో ఐదు రోజుల పని దినమును తప్పక అమలు చేయాలని వారు స్పష్టం చేశారు. మోసపూరిత వైఖరి విడనాడాలని న్యాయం చేకూర్చే మంచి నిర్ణయం తీసుకోవాలని వారు తెలిపారు. మా డిమాండ్స్ పరిష్కరించని యెడల మూడవసారి అక్టోబర్ 26 నుంచి నిరవధిక సమ్మె చేపడుతామని వారు హెచ్చరించారు. బ్యాంకుల్లో అన్ని శనివారాలను సెలవు దినాలుగా ప్రకటించి, పెండింగ్లో ఉన్న డిమాండ్లను పరిష్కరించాలని తెలిపారు. 2015లో కుదిరిన ఒప్పందములో రెండవ నాల్గవ శనివారాలను సెలవులుగా ప్రకటించాలని తెలిపారు. 2020 నవంబర్లో చర్చలు జరిగాయని అయినా ఫలితం లేదన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాలు ఆర్బిఐ, ఎల్ఐసి, జిఐసి నాబార్డ్ తో పాటు ప్రైవేట్ సంస్థల్లో ఇప్పటికే వారానికి ఐదు రోజుల పని దినం అమలు అవుతోందని వారు గుర్తు చేశారు. 2024 మార్చి 8న కుదిరిన వేతన ఒప్పందములో పరిష్కారము కానీ అనేక అంశాలను పెండింగ్ డిమాండ్ గా గుర్తించి పరిష్కరించాలని వారు కోరారు. వారానికి ఐదు రోజులు బ్యాంకింగ్ విధానం అమలుపై ప్రభుత్వం ఎలాంటి హామీ ఇవ్వకపోవడంతో సమ్మె నివారణకు ఎలాంటి అవగాహన కుదరదు అని వారు స్పష్టం చేశారు. సమ్మె చేసే రోజుల్లో అన్ని బ్యాంకు శాఖలో మూతపడతాయని బ్యాంకింగ్ సేవలు అందుబాటులో ఉండవు అని తెలిపారు. కావున వివిధ ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో పనిచేసే ఉద్యోగులందరూ ఈ సమ్మెను విజయవంతం చేయాలని వారు విజ్ఞప్తి చేశారు.


