- Advertisement -
విశాలాంధ్ర ధర్మవరం;; పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో మాసవారి సమావేశంలో ధర్మవరం పట్టణానికి చెందిన పి.చంద్రశేఖర్ ను శ్రీ సత్యసాయి జిల్లా కాంట్రాక్ట్ మెడికల్ ఎంప్లాయిస్ అసోసియేషన్ కన్వీనర్ గా ఎంపిక చేశారు. ఈ సందర్భంగా ఐఎన్టియుసి జిల్లా అధ్యక్షులు అమీర్ భాషా చేతులమీదుగా ధ్రువీకరణ పత్రమును పొందారు. ఈ సందర్భంగా చంద్రశేఖర్ మాట్లాడుతూ అసోసియేషన్ అభివృద్ధికి, ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తాను నిరంతరం పోరాడుతానని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో చీఫ్ ఫార్మసీ ఆఫీసర్ భాస్కరయ్య, నరేంద్ర, ప్రసాద్, రమాదేవి, కిష్టప్ప, స్టాఫ్ నర్స్ లు పాల్గొన్నారు.


