Homeక్రీడలుఏషియన్‌ గేమ్స్‌లో కొత్త చరిత్ర.. భారత్‌కు తొలి ఎంఎంఏ మెడల్‌!

ఏషియన్‌ గేమ్స్‌లో కొత్త చరిత్ర.. భారత్‌కు తొలి ఎంఎంఏ మెడల్‌!

- Advertisement -

భారత మిక్స్‌డ్‌ మార్షల్‌ ఆర్ట్స్‌ (ఎంఎంఏ)లో సుచికా తారియాల్‌ చరిత్ర సృష్టించింది. ఏషియన్‌ గేమ్స్‌లో భారత్‌కు ఎంఎంఏలో తొలి పతకాన్ని అందించిన క్రీడాకారిణిగా నిలిచింది. సోమవారం జరిగిన మహిళల ట్రెడిషనల్‌ 60 కేజీల విభాగంలో సుచికా.. కాంస్య పతకం సాధించింది. ఏషియన్‌ గేమ్స్‌లో ఈసారే ఎంఎంఏ తొలిసారి చోటు దక్కించుకుంది.సెమీఫైనల్లో సింగపూర్‌కు చెందిన హుయ్‌ హూన్‌ టియోతో సుచికా తలపడింది. హోరాహోరీగా సాగిన ఈ పోరు అదనపు సమయంలోకి వెళ్లింది. చివరకు స్వల్ప తేడాతో సుచిక ఓటమి పాలైంది. దీంతో ఫైనల్‌కు చేరే అవకాశం కోల్పోయినా.. అప్పటికే కాంస్య పతకం ఖాయమైంది.అంతకుముందు క్వార్టర్‌ఫైనల్లో మంగోలియాకు చెందిన అల్టాన్‌చిమెగ్‌ బైగల్మాను 2-0తో సుచికా ఓడించింది. దీంతో ఏషియన్‌ గేమ్స్‌లో ఎంఎంఏలో భారత్‌కు పతకం ఖాయం చేసిన తొలి క్రీడాకారిణిగా రికార్డు సృష్టించింది.36 ఏళ్ల సుచికా ప్రయాణం ఒక్క ఎంఎంఏకే పరిమితం కాలేదు. జాతీయ స్థాయి జూడో క్రీడాకారిణిగా ఎదిగిన ఆమె 2022 బర్మింగ్‌హామ్‌ కామన్వెల్త్‌ గేమ్స్‌లో పాల్గొంది. 2023 ఏషియన్‌ గేమ్స్‌లో కురాష్‌లోనూ పోటీ పడింది. ఆ తర్వాత జియూ-జిట్సులో సత్తా చాటి 2024లో ఫైటింగ్‌ జియూ-జిట్సు ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచింది.2017లో ఎంఎంఏలో ప్రొఫెషనల్‌గా అరంగేట్రం చేసిన సుచికా.. జూడో, జియూ-జిట్సుపై దృష్టి పెట్టడంతో కొన్నేళ్లు ఈ క్రీడకు దూరంగా ఉంది. 2024లో మళ్లీ ఎంఎంఏలోకి వచ్చి ‘బ్రేవ్‌ కంబాట్‌ ఫెడరేషన్‌్ణతో ఒప్పందం చేసుకుంది. గాయం వంటి అడ్డంకులను అధిగమించి తిరిగి వచ్చిన ఆమె.. ఇప్పుడు ఏషియన్‌ గేమ్స్‌లో భారత్‌కు చారిత్రక పతకం అందించింది.ఏషియన్‌ గేమ్స్‌లో ఎంఎంఏ తొలిసారి ప్రవేశించిన వెంటనే భారత్‌ కు పతకం రావడం విశేషం. ఈ ఘనత భారత ఎంఎంఏ చరిత్రలో సుచికా తారియాల్‌కు ప్రత్యేక స్థానం కల్పించింది.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు