ముంబై: సౌత్ ఇండియన్ బ్యాంక్ తమ ప్రధాన బ్రాండ్ సిద్దాంతమైన ‘బంధాల్లో పెట్టుబడి’ ఇతివృత్తంతో దీపావళి ప్రచార చిత్రాన్ని విడుదల చేసింది. ఒకరి జీవితాల్లో మరొకరు పంచే ఆనందం, ఆప్యాయతల్లోనే అసలైన పండుగ సంతోషం దాగి ఉందనే ఆలోచనను ఈ చిత్రం చాటుతోంది. దీపావళి ఓపెన్ మైక్ కార్యక్రమం నేపథ్యంలో ఈ ప్రచార చిత్రాన్ని రూపొందించారు. ఇందులో ప్రధాన పాత్రధారి ప్రేక్షకులను కొన్ని ఆసక్తికరమైన ప్రశ్నలు అడుగుతుంది. “దీపావళి సందర్భంగా చేసే పిండివంటల్లో అన్నింటికంటే తియ్యనైనది ఏది? పండుగ దీపాల కంటే ప్రకాశవంతంగా వెలిగేది ఏది? దీపావళి టపాసుల కంటే ఎక్కువగా మెరిసేది ఏది?” అని ప్రశ్నిస్తుంది. ఈ ప్రశ్నలపై ప్రేక్షకులు ఆలోచిస్తుండగా, సాధారణమైన దయాగుణం, కలిసిమెలిసి ఉండటం, ఆనందాన్ని పంచుకోవడం వంటి చిన్న చిన్న చర్యల్లో పండుగ స్ఫూర్తిని ఆవిష్కరించే మూడు హృదయానికి హత్తుకునే కథలను ఆమె వివరిస్తుంది. డిజిటల్ వేదికలపై విడుదలైన ఈ ప్రచార చిత్రానికి 48 గంటల్లోనే రెండు కోట్లకు పైగా వీక్షణలు నమోదయ్యాయి. హిందీ, కన్నడ, తెలుగు, తమిళం, మరాఠీ భాషల్లో ఈ చిత్రాన్ని విడుదల చేశారు. ఈ సందర్భంగా సౌత్ ఇండియన్ బ్యాంక్ చీఫ్ జనరల్ మేనేజర్, చీఫ్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ సోనీ ఎ మాట్లాడుతూ, “ మా దీపావళి ప్రచారం ఖుషియా బాడావో.. దివాలీ మనావో (సంతోషాలను పెంచండి.. దీపావళిని జరుపుకోండి) అనేది పంచుకోవడం, శ్రద్ధ చూపడం, తోడుగా నిలవడంలో ఉండే ఆనందాన్ని చాటుతోందన్నారు.


