తెలుగుదేశం పార్టీ
–బీసీ సంక్షేమ రాష్ట్ర అధ్యక్షులు సంకారపు జయశ్రీ
విశాలాంధ్ర ధర్మవరం; రాష్ట్రంలోని తెలుగుదేశం పార్టీలో బీసీలకు ఎల్లప్పుడూ సాముచిత స్థానమును కల్పించడం జరుగుతోందని రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షురాలు సంకారపు జై శ్రీ తెలిపారు. ఈ సందర్భంగా వారి స్వగృహములో నారా లోకేష్ జన్మదిన వేడుకలు బీసీ సంఘం నాయకులు, మహిళలు పాల్గొని కేకు కట్ చేసి, శుభాకాంక్షలును తెలియజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ టిడిపి పార్టీ వ్యవస్థాపకుడు కీర్తిశేషులు నందమూరి తారక రామారావు తరము నుంచి నేటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వరకు బీసీలకు ఎంతో ప్రాముఖ్యత ఇస్తూ రాష్ట్రాన్ని అభివృద్ధి పాలనలో నడిపిస్తున్నాడని తెలిపారు. అంతేకాకుండా బీసీలలో మహిళలు కూడా ఎంతో సముచిత స్థానం ఇచ్చి గుర్తింపు తేవడం ఒక టిడిపి పార్టీకే దక్కిందని తెలిపారు. ఆనవాయితీగా బీసీలకు ఇస్తున్న ప్రాధాన్యతను బట్టి రాష్ట్రంలోని బీసీలు కూడా టిడిపి పార్టీకు, మనుగడకు ఎల్లప్పుడూ కృషి చేస్తున్నారని తెలిపారు. బీసీలకు గౌరవము, అక్కున చేర్చుకోవడం నిజంగా సంతోషించదగ్గ విషయమని తెలిపారు. నారా లోకేష్ మరిన్ని పదవులను పొందుతూ భవిష్యత్ తరాలకు కూడా బీసీలకు మంచి స్థానాన్ని ఇవ్వాలని వారు ఆశాభవాన్ని వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో బీసీ సంఘం నాయకులు, మహిళలు పాల్గొన్నారు.


