ప్రిన్సిపాల్ మల్లికార్జున
విశాలాంధ్ర ధర్మవరం : పట్టణంలోని పద్మావతి డిగ్రీ కళాశాలలో విద్యార్థిని విద్యార్థులకు హెచ్ఐవి, ఎయిడ్స్ లపై అవగాహన సదస్సును నిర్వహించడం జరిగిందని ప్రిన్సిపాల్ మల్లికార్జున తెలిపారు. ఈ సందర్భంగా ఈ అవగాహన సదస్సు ఆంద్రప్రదేశ్ రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ సంస్థ ఆదేశముల మేరకు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ,జిల్లా ఎయిడ్స్ నివారణ నియంత్రణ సంస్థ, ఎస్ ఎం ఎం ఎస్, ధర్మవరం
స్వచ్చంద సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగిందన్నారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ,జిల్లా ఎయిడ్స్ నివారణ, నియంత్రణ సంస్థ జిల్లా సూపర్‌వైజర్ జి.వి. రమణ , ఎం ఈ ఏ.. మురళి , హెచ్.ఐ.వి/ఎయిడ్స్ పై అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది అని తెలిపారు.ఈ కార్యక్రమములో భాగముగా హెచ్.ఐ.వి/ఎయిడ్స్ వ్యాధి ఎలా వస్తుంది? ఎలా వ్యాపించదు? హెచ్.ఐ.వి/ఎయిడ్స్ రాకుండా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి విద్యార్థులకు వివరించడం జరిగిందన్నారు. హెచ్.ఐ.వి/ఎయిడ్స్ వ్యాధిగ్రస్తుల పట్ల వివక్షత చిన్న చూపు లేకుండా ఎలాగా సమాజములో కలసి జీవించాలి, హెచ్.ఐ.వి/ఎయిడ్స్, క్షయ వ్యాధి సంబందం గూర్చి, సుఖ వ్యాధులు , చికిత్స గూర్చి,కండోమ్ యొక్క ఉపయోగము గూర్చి, హెచ్.ఐ.వి/ఎయిడ్స్ ఏక్ట్ 2017, ఏ ఆర్ టి మందులు, జుఆఐజ్పుఐ ఏపీ ఎస్ ఏ సి ఎస్ యాప్ ,టోల్ ఫ్రీ నెంబర్ 1097 గూర్చి తెలిపారు. ,అలానే చెడు వ్యసనాలకు, డ్రగ్స్ వాడటం వల్ల కలిగే నష్టాలు చెబుతూ పూర్తి వివరించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో ప్రాజెక్ట్ మేనేజర్ నవీన్ కుమార్, కళాశాల అధ్యాపకులు, విద్యార్ధులు పాల్గొన్నారు.
హెచ్ఐవి, ఎయిడ్స్ లపై విద్యార్థులకు అవగాహన కార్యక్రమం..
- Advertisement -
RELATED ARTICLES


