విశాలాంధ్ర ధర్మవరం : మండల పరిధిలోని గుడ్లూరు గ్రామ సర్పంచి పిట్టా నరసమ్మ కేంద్ర జల శక్తి మంత్రి గజేంద్ర శకావత్ అధికారుల నుంచి స్వచ్ఛ పురస్కారమును అందుకున్నారు. గ్రామంలో మలవిసర్జన రహిత గ్రామంగా తీర్చిదిద్దినందుకు కేంద్ర ప్రభుత్వం నరసమ్మను గుర్తించి ఈ పురస్కారాన్ని అందజేయడం జరిగింది. గ్రామంలో స్వచ్ఛత కార్యక్రమాలు 100 శాతము మరుగుదొడ్ల నిర్మాణాలు చేపట్టడం వల్ల కేంద్ర ప్రభుత్వం ఢిల్లీలో జరిగిన స్వాతంత్ర వేడుకల కు ఆహ్వానంలో భాగంగా ఈ పురస్కారం అందుకోవడం జరిగింది. ఈ సందర్భంగా ఎంపీడీవో సాయి మనోహర్, సచివాలయ ఉద్యోగులు, గ్రామ ప్రజలు, స్వచ్ఛంద సేవా సంస్థలు, వివిధ ప్రభుత్వ అధికారులు సర్పంచ్ నరసమ్మకు అభినందన శుభాకాంక్షలు తెలియజేశారు.
కేంద్ర మంత్రి ద్వారా గోట్లూరు సర్పంచ్ పిట్టా నరసమ్మకు పురస్కారం
- Advertisement -
RELATED ARTICLES


