ఘనంగా బెత్లెహేము స్త్రీల క్రిస్మస్ వేడుకలు.
విశాలాంధ్ర – కడియం : కడియం మండలం, జేగురుపాడు గ్రామంలో బైబిల్ మిషన్ ( గుంటూరు హెచ్ఓ) ఆధ్వర్యంలో బెత్లెహేము స్త్రీల క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈకార్యక్రమంలో ముఖ్య అతిథిగా గ్రామ సర్పంచ్ యాదల సతీష్ చంద్ర స్టాలిన్ పాల్గొన్నారు. బైబిల్ వాక్యోపదేశం కె ప్రసన్న కుమారి చేశారు. బైబిల్ మిషన్ సెక్రటరీ కె ఎస్తేరు దేవదాస్ క్రిస్మస్ గ్రీటింగ్స్ ఇచ్చారు. స్త్రీల క్రిస్మస్ కన్వీనర్ సాకా శాంతకుమారి, సంఘ పాస్టర్ డాక్టర్ రెవ సాకా మహిమ రాజు ఆధ్వర్యంలో క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సన్నిధి స్త్రీలు, సంఘ పెద్దలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.


