Thursday, January 15, 2026
Homeఆంధ్రప్రదేశ్కోటి సేకరణ

కోటి సేకరణ

- Advertisement -

కడియం లో కోటి సంతకాల సేకరణ.

విశాలాంధ్ర – కడియం : ప్రభుత్వ మెడికల్‌ కళాశాలలను ప్రైవేటుపరం చేయాలనే నిర్ణయాన్ని ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ శనివారం సాయంత్రం మండల కేంద్రమైన కడియం గ్రామంలో వైస్సార్ కాంగ్రెస్ పార్టీ  రాష్ట్ర కార్యదర్శి, నిడదవోలు కొవ్వూరు అబ్జర్వర్ గిరజాల బాబు ఆధ్వర్యంలో కోటి సంతకాల సేకరణ కార్యక్రమం నిర్వహించారు. కడియం గ్రామంలో  వంగపండు వారి వీధి, తామెళ్ళ వారి వీధి, మసీద్ వీధి లలో  పార్టీ నాయకులు కార్యకర్తలతో ఇంటింటికి వెళ్లి సంతకాల సేకరించారు. ఈకార్యక్రమంలో వంగపండు ప్రసాద్, గుత్తుల రమేష్, దొడ్డా బుజ్జి,  పున్నమి రాజు వీర్రాజు, పూడి వీరబ్రహ్మం, చిలుకూరు రామకృష్ణ, తోరాటి గోపి, దామిశెట్టి అశోక్, కడియం గణేష్, తోట సురేష్, శాకా సతీష్, బత్తిన శ్రీధర్, శీరిగినీడి సత్యనారాయణ, కొమ్ము సత్తియ్య, వేములూరి బాస్కరావు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు