Thursday, January 15, 2026
Homeఆంధ్రప్రదేశ్ఎంపీడీవోగా శ్యాంప్రసాద్

ఎంపీడీవోగా శ్యాంప్రసాద్

- Advertisement -

కడియం డిప్యూటీ ఎంపీడీవోగా శ్యాంప్రసాద్.

విశాలాంధ్ర – కడియం : పంచాయతీరాజ్ శాఖలో కూటమి ప్రభుత్వం తీసుకొచ్చిన సంస్కరణలలో భాగంగా నూతనంగా ఏర్పటైన కడియం మండలం సచివాలయాల (జిఎస్‌డబ్ల్యూఎస్) డిప్యూటీ ఎంపీడీవో గా సూరంపూడి శ్యాంప్రసాద్ ను నియమించారు. ఈ మేరకు ఆయన ఎంపిడివొ కె రమేష్ కు జాయినింగ్ రిపోర్ట్ ఇచ్చారు. ఈయన సర్వీస్ అంతా ఆర్‌డబ్ల్యూఎస్ శాఖలో సాగింది. కొత్తపేట ఆర్‌డబ్ల్యూ‌ఎస్ డిఈ కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్ గా పనిచేస్తూ పదోన్నతిపై ఇక్కడకు వచ్చారు. సుదీర్ఘ కాలం పాటు ఈయన రాజమహేంద్రవరం ఆర్‌డబ్ల్యూ‌ఎస్ ఈఈ కార్యక్రమంలో పనిచేశారు. ఈ సందర్భంగా శ్యాంప్రసాద్ మాట్లాడుతూ కడియం మండల పరిధిలో గల 27 గ్రామ సచివాలయాల ద్వారా ప్రజలకు ప్రభుత్వం ప్రవేశపెట్టే సేవలను సక్రమంగా అందించేందుకు తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు