విశాలాంధ్ర – మండపేట : సంక్రాంతి సందర్భంగా మండపేట సువార్త సైనికులు నిర్వహించిన షటిల్ టోర్నమెంట్ లో విజేతలకు టీడీపీ యువనేత కుమార్ బాబు గురువారం బహుమతులు అందజేశారు. టోర్నమెంట్ విజేత గా నిలిచిన కాలేరు కు చెందిన హర్ష వర్ధన్ టీమ్ ను, రన్నర్ గా నిలిచిన అచ్యుతాపురం కిరణ్ పాల్ టీమ్ ను కుమార్ బాబు అభినందించి మెమెంటో లు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ఎస్ వ్యవస్థాపకులు బుంగ సంజయ్ మాదిగ, ఎమ్మార్పీఎస్ రాష్ట్ర కార్యదర్శి ధూళి జయరాజు మాదిగ, 7వ వార్డు కౌన్సిలర్ సవరపు సతీష్, గొడవర్తి సురేంద్ర, పట్టణ టీడీపీ ఎస్సీ సెల్ అధ్యక్షులు బొమ్ము గంగాధర్, తవిటికి లక్ష్మణ్, గుమ్మెళ్ళ మహేష్, చిన్నరాజు, బొట్టా వీర్రాజు, పిల్లి సుధాకర్, గంధం వెంకన్న, తొత్తరమూడి ఇశ్రాయేల్ తదితరులు పాల్గొన్నారు.
షటిల్ టోర్నమెంట్ విజేతలకు బహుమతుల పంపిణీ
- Advertisement -
RELATED ARTICLES


