Homeజిల్లాలుశ్రీ సత్యసాయిప్రతి విద్యార్థి అన్ని పోటీలలో పాల్గొంటే మంచి నైపుణ్యం లభిస్తుంది

ప్రతి విద్యార్థి అన్ని పోటీలలో పాల్గొంటే మంచి నైపుణ్యం లభిస్తుంది

- Advertisement -

మండల వినియోగదారుల కార్యదర్శి చిన్న తంబి చిన్నప్ప
విశాలాంధ్ర ధర్మవరం;! ప్రతి విద్యార్థి చదువుతోపాటు అన్ని పోటీలలో పాల్గొంటే మంచి నైపుణ్యం లభిస్తుందని మండల వినియోగదారుల సంఘం కార్యదర్శి చిన్న తంబి చిన్నప్ప, జిల్లా వినియోగదారుల సమాచార సమాఖ్య వైస్ చైర్మన్ పోలా ప్రభాకర్ తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పట్టణంలోని కొత్తపేటలో గల బాలికల ఉన్నత పాఠశాల యందు జాతీయ వినియోగదారుల వారోత్సవాలు సందర్భంగా డిజిటల్ న్యాయపాలన ద్వారా సత్వర సమర్థ పరిష్కారం అనే అంశంపై వ్యాసరచన పోటీలను నిర్వహించారు. ఈ పోటీలో గెలుపొందిన విద్యార్థులలో ప్రధమలో యు. తరిని, ద్వితీయ ఎం. నాగప్రణిత, తృతీయ స్థానంలో వచ్చిన వారికి కూడా అందరికీ సర్టిఫికెట్లతో పాటు మెమొంటోలను కూడా అందజేయడం జరిగిందని తెలిపారు. ఈ వారోత్సవాలు డిసెంబర్ 18 నుండి జనవరి 24వ తేదీ వరకు జరుగుతాయని తెలిపారు. ఈ పరీక్షలకు పాఠశాలలోని 390 మంది విద్యార్థినీలు పాల్గొన్నారు. అనంతరం పాఠశాల హెడ్మాస్టర్ రాంప్రసాద్, ఓలా ప్రభాకర్, బి నారాయణమ్మ, చిన్న తంబి చిన్నప్ప, పళ్లెం జనార్ధనలు పలు విషయాలను విద్యార్థులకు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, మండల వినియోగదారుల సభ్యులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు