Homeజిల్లాలుశ్రీ సత్యసాయివిద్యుత్ సమస్యల పరిష్కారానికి కరెంటోళ్ల జనబాట

విద్యుత్ సమస్యల పరిష్కారానికి కరెంటోళ్ల జనబాట

- Advertisement -

విశాలాంద్ర బ్యూరో శ్రీ సత్యసాయి – జిల్లాలో ప్రజల విద్యుత్ సమస్యలను నేరుగా గుర్తించి వేగంగా పరిష్కరించాలనే లక్ష్యంతో విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో కొత్తగా ప్రారంభించిన నికరెంటోళ్ల జనబాట కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ ఏ. శ్యాం ప్రసాద్ అధికారికంగా ప్రారంభించారు.స్థానిక పుట్టపర్తి కలెక్టరేట్లోని పిజిఆర్ఎస్ హాలులో ఈ కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్‌ను జిల్లా కలెక్టర్ తన చేతుల మీదుగా ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఈ కార్యక్రమం ద్వారా విద్యుత్ శాఖ సిబ్బంది ప్రతి మంగళవారం, శుక్రవారం నిర్దేశిత గ్రామాలు, వార్డులలో క్షేత్రస్థాయిలో పరిశీలనలు చేపట్టి, విద్యుత్ సరఫరా లోపాలు, సాంకేతిక సమస్యలు, ప్రజల ఫిర్యాదులను గుర్తించి వెంటనే పరిష్కరించేలా చర్యలు తీసుకుంటారని తెలిపారు. ప్రజలకు నిరంతర, నాణ్యమైన విద్యుత్ సరఫరా అందించడమే ఈ కార్యక్రమం యొక్క ప్రధాన ఉద్దేశమని కలెక్టర్ స్పష్టం చేశారు. ప్రజలు ఎదుర్కొంటున్న చిన్నచిన్న సమస్యలను కూడా నిర్లక్ష్యం చేయకుండా వెంటనే స్పందించాలని విద్యుత్ శాఖ అధికారులను ఆయన ఆదేశించారు.ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ ఎం మౌర్య భరద్వాజ్, డిఆర్ఓ సూర్యనారాయణ రెడ్డి, ఎస్డిసి రామసుబ్బయ్య, ఆర్డీఓ సువర్ణ, విద్యుత్ శాఖ ఎస్ ఈ సంపత్ కుమార్, విద్యుత్ శాఖ, వివిధ శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు