విశాలాంధ్ర- ఉరవకొండ (అనంతపురం జిల్లా) : స్థానిక ఎస్కే ప్రభుత్వ హైస్కూల్లో సోమవారం గణిత శాస్త్ర దినోత్సవంను పురస్కరించుకొని భారతీయ గణిత శాస్త్రవేత్త శ్రీనివాస రామానుజన్ అయ్యంగార్ 138 జయంతిని ఘనంగా నిర్వహించారు. హైస్కూల్ ప్రధానోపాధ్యాయులు సత్యనారాయణ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో శ్రీనివాస రామానుజన్ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. అనంతరం గణిత ల్యాబ్ ను ప్రారంభించారు. పాఠశాల హెచ్ఎం మాట్లాడుతూ శ్రీనివాస రామానుజన్ 22 డిసెంబర్ 1887 సంవత్సరశీ కోమలతమ్మాల్ కుప్పుస్వామి దంపతులకు జన్మించాడని మరియు 26 ఏప్రిల్ 1920 సంవత్సరంలో మరణించినట్లు తెలిపారు. శ్రీనివాస రామాంజన్ అతి చిన్న వయసులోనే అపారమైన మేధస్సుతో ప్రపంచ శిఖరాలపై భారతదేశం కీర్తిని చాటి చెప్పిన మేధావి, దాదాపుగా 3900 గణిత సమీకరణాలను కనుగొన్నాడని అందుకే మన దేశం ప్రతి సంవత్సరం ఆయన జన్మదిన పురస్కరించుకొని గణిత శాస్త్ర దినోత్సవం గా జరుపుతున్నామన్నారు. కావున విద్యార్థులందరూ రామాంజన్ ని ఆదర్శం తీసుకొని గణిత శాస్త్రంలో నైపుణ్యతను పెంపొందించుకొని శాస్త్ర,సాంకేతిక రంగాల్లో ఎదగాలన్నారు. రామానుజన్ జన్మదినాన్ని పురస్కరించుకొని విద్యార్థులు తయారు చేసిన గణిత ఫార్ములాల చార్టులలో నైపుణ్యత కనబరిచిన విద్యార్థులకు ప్రోత్సాహక బహుమతులు బహుకరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు.


