ఎస్సీ,ఎస్టీ విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సభ్యులు కౌకుంట్ల రవి
విశాలాంధ్ర- ఉరవకొండ (అనంతపురం జిల్లా) : పేద, ఎస్సీ, ఎస్టీ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న అర్హత లేని ఆర్ఎంపీ డాక్టర్ల పై చర్యలు తీసుకోవాలని గుంతకల్ రెవిన్యూ డివిజనల్ ఎస్సీ,ఎస్టీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సభ్యులు కౌకుంట్ల చకరి రవి పేర్కొన్నారు. సోమవారం స్థానిక తాసిల్దార్ని కలిసి ఆయన వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గుంతకల్ రెవిన్యూ డివిజన్ పరిధిలోని గ్రామీణ ప్రాంతాల్లో ఎస్సీ ఎస్టీ పేద ప్రజలకు ఆర్ఎంపీ వైద్యులు అరకొర జ్ఞానంతో ఎలాంటి విద్యా అర్హతలు లేకున్నా వైద్యం అందిస్తూ ప్రాణాలు తీస్తున్నారని ఆరోపించారు. కార్పొరేట్ హాస్పిటల్ కి మెరుగైన వైద్యం పేరుతో పంపుతూ కమిషన్లు పొందుతున్నారని మోసం చేస్తూ కోట్లు రూపాయలును దండుకుంటున్న ఆర్ఎంపీ డాక్టర్ ల పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని కోరారు. చాలామంది ఆర్ఎంపీ డాక్టర్లు కొంతకాలం ఆర్ఎంపీలు తోనే తర్ఫీదు పొంది విచ్చలవిడిగా గ్రామీణ ప్రజలకు వైద్యం అందిస్తూ ఎమ్మెస్ మరియు ఎంబిబిఎస్ డాక్టర్ల కంటే గొప్పగా వైద్యం చేస్తామని మాయమాటలు చెబుతూ గ్లూకోజ్ బాటిల్స్ ఎక్కిస్తూ రక్తం ఎక్కిస్తూ అబార్షన్లు చేస్తూ ప్రాణాలతో చెలగాటమాడుతున్నారని ఆరోపించారు. కార్పొరేట్ హాస్పిటలతో సంబంధాల ఏర్పరచుకొని సిటీ స్కాన్, ఎమ్మారై, ల్యాబ్ మరియు ఆపరేషన్లు లలో కమిషన్లు తీసుకుంటూ అలాగే రిప్రజెంటివ్స్ ఇచ్చే కమిషన్లు తీసుకొని కోట్ల రూపాయలు అర్జిస్తూ విలాసవంతమైన జీవితాన్ని గడుపుతున్నారని పేర్కొన్నారు. వైద్య ఆరోగ్యశాఖ అధికారులు ఎక్కడ కూడా ఆర్.ఎం.పి డాక్టర్ల యొక్క ఆసుపత్రులని తనిఖీ చేయడం లేదన్నారు. సామాజిక స్పృహ కలిగిన ఎవరైనా ప్రశ్నిస్తే వారిపై బ్లాక్మెయిల్ చేసినరని బెదిరింపులు అబాండాలు వేస్తూ పబ్బం గడుపుకుంటున్నారని అర్హత లేని వారిని గుర్తించి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలన్నారు.


