విశాలాంధ్ర బ్యూరో కర్నూలు : కేంద్ర ప్రభుత్వం గ్రామీణ ప్రాంత పేద ప్రజలకు మహాత్మాగాంధీ ఉపాధి హామీ పథకంలో హామీ లేకుండా చేసి, గాడ్సే వారసులను తృప్తి పరిచేందుకు పథకంలో గాంధీ పేరు లేకుండా చేస్తున్నారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు పీ హరినాధ్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం సీపీఐ జాతీయ సమితి పిలుపులో భాగంగా వామపక్షపార్టీల అద్వర్యంలో సీపీఐ నగర కార్యదర్శి పీ రామకృష్ణారెడ్డి, సీపీఎం నాయకులు రాముడు అధ్యక్షతన కలెక్టరేట్ ఎదుట నిరసన కార్యక్రమం చేపట్టారు.. ఈ కార్యక్రమంలో సీపీఐ రాష్ట్రకార్యదర్శి వర్గ సభ్యులు కె రామాంజనేయులు, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు ప్రభాకర్‌రెడ్డి, ఎస్‌యూసీఐ నాయకులు నాగన్న, సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శులు ఎస్ మునెప్ప, ఎన్ లెనిన్బాబులు పాల్గొన్నారు. ఈ నిరసన కార్యక్రమాన్ని ఉద్దేశించి హరినాధ్‌రెడ్డి మాట్లాడుతూ మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం అద్భుతమైన పథక మన్నారు. ఇది గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు వలసలు పోకుండా వారికి ఉపాధి అందిస్తుందన్నారు. పథకంను నిర్వీర్యం చేయడానికి కేంధ్రంలోని బీజేపీ ప్రభుత్వం కుట్రలు చేస్తుందని విమర్శించారు. ఇటువంటి పథకాన్ని పట్టణాలకు విస్తరింపచేసి పట్టణ ప్రాంతాల్లోని యువతకు ఉపాధి కల్పించాలని డిమాండ్ చేశారు.కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ఈ పథకంలోని మహాత్మాగాంధీ లాంటి స్వాతంత్య్ర సమరయోధుని పేరు తొలగించాలని నిర్ణయం తీసుకోవడం దుర్మార్గమన్నారు. స్వాతంత్ర ఉద్యమంలో ఎటువంటి పాత్రలేని వ్యక్తులు గా ంధీ పేరును తొలగించాలని చెప్పడం దారుణమన్నారు. ఉపాధి హామీ చట్టంను నిర్వీర్యం చేయుటకు కేంద్రం నిధులను 60శాతం వాటా మాత్రమే ఇస్తామని,రాష్ట్ర 40శాతం బరించాలని చెప్పడం ఈ పథకంను ఎదో విధంగా అబాసుపాలు చేసి తొలగించాలనే కుట్రలో భాగమే నన్నారు. రాష్ట్రం ఇప్పటికే అప్పులపాలైతే కేంద్రం ఉపాధి పథకంకు 4వేల కోట్లు బరించాలని చెప్పడం రాష్ట్రంపై మరింత బారం పడటమే కాకుండా ఈ పధకంను నిర్వీర్యం చేయడమే నన్నారు. ఈ కార్యక్రమంలో సీపీఐ, సీపీఎం, ప్రజాసంఘాల నాయకులు కార్యకర్దలు పాల్గొన్నారు.
ఉపాధి హామీలో హామీ ఎక్కడ ?గాడ్సే వారసులను తృప్తి పరిచేందుకే గాంధీ పేరు లేకుండా చేస్తున్నారు…… పి హరినాధ్‌రెడ్డి
- Advertisement -
RELATED ARTICLES


