Wednesday, February 18, 2026
Homeజిల్లాలుఎన్టీఆర్ జిల్లాపరీక్షలను ధైర్యంగా ఎదుర్కొవాలి

పరీక్షలను ధైర్యంగా ఎదుర్కొవాలి

- Advertisement -


చదువులో విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ద

సివిఆర్ హైస్కూల్‌ను తనిఖీ చేసిన కలెక్టర్ జి. లక్ష్మీశ
విశాలాంధ్ర`విజయవాడ: రానున్న నెల రోజులు విద్యార్థులకు అత్యంత కీలకమైన సమయమని విద్యార్థుల భవిష్యత్ను దృష్టిలో ఉంచుకుని పరీక్షలను ధైర్యంగా ఎదురుకునేలా విద్యార్థులను సన్నద్ధం చేసేందుకు చర్యలు తీసుకోవాలని పరీక్ష ఫలితాలలో పూర్తి స్థాయి లక్ష్యాలను సాధించి తల్లిదండ్రులు పెట్టుకున్న సమ్మకాన్ని రెట్టింపు చేసేందుకు ఉపాధ్యాయులు కృషిచేయాలని, జిల్లా కలెక్టర్ డా. జి లక్ష్మీశ సూచించారు.విద్య సంవత్సరం ముగిసి పరీక్షలు నిర్వహించే సమయం మొదలవుతున్న నేపథ్యంలో పాఠశాలలో తనిఖీలలో భాగంగా జిల్లా. కలెక్టర్ బుధవారం నగరంలోని సివిఆర్ హైస్కూల్ను ఆకస్మికంగా సందర్శించి విద్యార్థుల విద్యా భోదనను పరిశీలించారు.ఈ సందర్భంగా పదవ తరగతి విద్యార్థులతో జిల్లా కలెక్టర్ ముచ్చటిస్తూ విద్యార్థుల మేధా శక్తిని పరిశీలించి పలు ప్రశ్నలు వేశారు. గణితం, సోషల్ స్టడీస్కు సంబంధించి అడిగిన ప్రశ్నలకు విద్యార్థుల నుండి వచ్చిన సమాదానాల పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు. విద్యార్థులు ఏ విషయాన్ని చదువుతున్నా 360 డిగ్రీ కోణంతో అధ్యయనం చేయాలని.. అప్పుడే నేర్చుకున్న విషయాలు ఇప్పటి పరీక్షలకే కాకుండా జీవితాంతం ఉపయోగపడతాయని సూచించారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే ఎందరో తమ మేధస్సుతో, నిత్యం నేర్చుకోవాలనే తపనతో ప్రశ్నిస్తూ, నేర్చుకుంటూ ఉన్నత స్థానాలకు ఎదిగారని అటువంటి వారిని స్ఫూర్తిగా తీసుకొని కష్టపడి, ఇష్టపడి చదువుకోవాలని సూచించారు. పరీక్షలు సమీపిస్తున్న కీలక సమయంలో ఉపాధ్యాయులు సెలవులు వినియోగించవద్దన్నారు. ఈ విషయాన్ని గుర్తించి ఉపాధ్యాయులు ప్రతి విద్యార్థి పదో తరగతి పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించేలా కృషిచేయాలన్నారు. మధ్యాహ్న భోజన పథకాన్ని సమర్థవంతంగా నిర్వహించాలని పాఠశాలలో పచ్చదనం పరిశుభ్రతకు అధిక ప్రాధాన్యతను ఇవ్వాలని కలెక్టర్ ప్రధానోపాధ్యాయునికి సూచించారు.ఆకస్మిక తనిఖీలో కలెక్టర్ వెంట పాఠశాల ప్రధానోపాధ్యాయులు సిహెచ్ సుబ్రహ్మణ్యం, ఉపాధ్యాయినీ ఉపాధ్యాయులు, బోధనేతర సిబ్బంది తదితరులు ఉన్నారు..

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు