విశాలాంధ్ర ధర్మవరం; వెనుకబడిన కులాలలో ఒకటైన (బి సి- బి), చేనేత ఉప కులాలలో ఒకటైన, ఛత్రపతి శివాజీ మహారాజ్ వంశమునకు చెందిన స్వకుల సాలి కులస్తుల సమావేశం అనంతపురం లోని అంభా భవానీ కల్యాణ మంటపం నందు అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీ సత్య సాయి జిల్లా ధర్మవరం పట్టణమునకు చెందిన జూజారె నాగరాజును రాష్ట్ర గౌరవ అధ్యక్షులుగా నియమించుటకు, జిల్లా కమిటీ సభ్యులు అయిన జూజారె సురేష్ ప్రతిపాదన చేసారు. ఈ ప్రతిపాదనను రాష్ట్ర అధ్యక్షులు కాంలే నగేష్ , అనంతపురం జిల్లా అధ్యక్షులు సరోదే రాజేంద్రప్రసాద్ తీర్మానం చేసారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ అధ్యక్షులగా ఎన్నిక అయిన జుజారె నాగరాజుని, ధర్మవరం స్వకులాసాలి సంఘము కమిటీ వారైనా సరోదే కృష్ణమూర్తి, జిందే శివశంకర్, సరోదే భుజంగారావు, కాంలే లక్ష్మణ్, చిల్లాలే నాగరాజు, జుజారె ఈశ్వర్, జయప్రకాశ్ తదితరులు అభినందనలు తెలిపినారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్వకుల సాలి సంఘము గౌరవ అధ్యక్షులుగా జూజారె నాగరాజు నియామకం
- Advertisement -
RELATED ARTICLES


