Homeజిల్లాలుకర్నూలుమొండి బకాయిదారులపై చట్టపరమైన చర్యలు తప్పవు

మొండి బకాయిదారులపై చట్టపరమైన చర్యలు తప్పవు

- Advertisement -

* ఛైర్మన్ మీ సేవ ఆంజనేయులు

విశాలాంధ్ర – పెద్దకడబూరు (కర్నూలు) : పెద్దకడబూరు సొసైటీలో స్వల్ప, ధీర్ఘకాలిక రుణాలు తీసుకొని చాలా సంవత్సరాలుగా చెల్లించకుండా ఉన్న మొండి బకాయిదారులపై చట్టపరమైన చర్యలు తప్పవని సొసైటీ ఛైర్మన్ తలారి మీ సేవ ఆంజనేయులు స్పష్టం చేశారు. మంగళవారం పెద్దకడబూరు సొసైటీలో సీఈవో మురళీధర్ రెడ్డి ఆధ్వర్యంలో పాలకమండలి సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ సందర్భంగా సొసైటీ ఛైర్మన్ మీసేవ ఆంజనేయులు ఆంజనేయులు మాట్లాడుతూ ఇప్పటికే సొసైటీ ద్వారా రైతులకు కోటి రూపాయలు ధీర్ఘకాలిక రుణాలు అందజేశామని తెలిపారు. గతంలో సొసైటీ ద్వారా ధీర్ఘకాలిక రుణాల కింద రూ 50 లక్షలు పొందిన రైతుల నుంచి వడ్డీ వసూలు చేసి రెన్యూవల్ చేశామన్నారు. దీనిని దృష్టిలో ఉంచుకుని మరో కోటి రూపాయలు ధీర్ఘకాలిక రుణాలు మంజూరు చేయాలని జిల్లా కేడీసీసీ చైర్మన్ కు ప్రతిపాదనలు పంపామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సొసైటీ డైరెక్టర్లు గోనుమాను నరసన్న, హనుమేష్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు