వ్యవస్థాపకులు కోళ్ల మొరం చంద్రశేఖర్ రెడ్డి
విశాలాంధ్ర ధర్మవరం; పట్టణంలోని శాంతినగర్ లో గల విశ్వదీప సేవా సంఘం కార్యాలయము నందు స్వామి వివేకానంద జయంతి (జాతీయ యువజన దినోత్సవం) ఘనంగా నిర్వహించుకున్నారు. ముఖ్య అతిధి గా వేణు మోటార్స్ అధినేత దేవిరెడ్డి వేణుగోపాల్ హాజరై, అనంతరం వారు మాట్లాడుతూ స్వామి వివేకానంద స్పూర్తితో యువత మంచి మార్గంలో నడుచుకుంటూ సమాజసేవ చేయాలని కొనియాడారు. ఫౌండర్ కోళ్ళమొరం చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ స్వామి వివేకానంద దేశ విదేశాల్లో మన భారతదేశం కీర్తి ప్రతిష్టలు పెంచిన మహోన్నత వ్యక్తి అని తెలిపారు. మన ధర్మవరం లో స్వశక్తి తో ఎదిగి ఎంతోమంది యువతకు ఉపాధి అవకాశం కల్పిస్తూ ధర్మవరం ప్రతిష్ట పెంచుతున్న వేణు మోటార్స్ అధినేత వేణుగోపాల్ను ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకొని ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. అధ్యక్షులు గాజుల సురేష్, సలహాదారుడు లక్ష్మినారాయణ మాట్లాడుతూ స్వామి వివేకానంద శ్రీ రామక్రిష్ణ పరమహంస కు శిష్యుడుగా చేరి భారతదేశ పర్యటన చేస్తూ ఎంతో మంది యువతకు తన ప్రసంగాల ద్వారా ఆకర్షతులైనారు అని తెలిపారు. ఈ ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు T.చంద్రశేఖర్ రెడ్డి కార్యదర్శి జుజారు రఘు ప్రభాకర్ రెడ్డి చంద్ర, ఖమ్మం మాధవ మధు నాయుడు అక్కులప్ప, మనోహర ధనుంజయ, నాగ, సూరి, నారాయణస్వామి, సుబ్రహ్మణ్యం, వెంకటరమణ, నాగేశం సేవా సంఘం సభ్యులు పాల్గొన్నారు.
విశ్వదీప సేవా సంఘం కార్యాలయంలో స్వామి వివేకానంద జయంతి వేడుకలు..
- Advertisement -
RELATED ARTICLES


