వైకాపా మండల కన్వీనర్ బసవరాజు
విశాలాంధ్ర -ఆస్పరి (కర్నూలు జిల్లా) : యూరియా అందక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో మంగళవారం నిర్వహిస్తున్న రైతు పోరు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని వైయస్సార్సీపి మండల కన్వీనర్ బసవరాజు, సొసైటీ మాజీ చైర్మన్ లు గోవర్ధన్, దుమ్మా నరసింహులు, ఎస్సీ సెల్ రాష్ట్ర కార్యదర్శి గుడిసె మహానంది, వైకాపా తాలూక యూత్ అధ్యక్షులు అశోక్, జిల్లా యువజన కార్యదర్శి మసాలా ప్రకాష్, వైస్ ఎంపీపీ లింగమ్మ తనయుడు తేవుల ప్రకాష్ లు వైయస్సార్సీపి శ్రేణులకు పిలుపునిచ్చారు. సోమవారం స్థానిక గాంధీ పార్క్ లో అన్నదాత పోరు వాల్ పోస్టర్లను విడుదల చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రైతులకు సకాలంలో యూరియా అందించలేని స్థితిలో కూటమి ప్రభుత్వం ఉందని అన్నారు. గత వైసిపి ప్రభుత్వంలో రైతులకు ఏ కష్టం రాకుండా జగన్మోహన్ రెడ్డి అండగా నిలచారన్నారు. రైతుల సమస్యలను కూటమి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళేందుకే రైతు పోరు నిరసన కార్యక్రమం చేపట్టినట్లు తెలిపారు. అందులో భాగంగా పత్తికొండ ఆర్డిఓ కార్యాలయాన్ని రైతులతో కలిసి మంగళవారం ముట్టడిస్తున్నట్లు వారు తెలిపారు. వైయస్సార్సీపీ శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ రాధాకృష్ణ, బీసీ సంఘం జిల్లా నాయకులు హలిగేర నాయుడు, జొహరాపురం నాగన్న, యల్లప్ప, చంద్ర, శివ, హుస్సేన్ పీరా, లక్ష్మన్న, వీరేంద్ర, నరసింహులు పాల్గొన్నారు.


