Homeజిల్లాలుకర్నూలుసొసైటీ పరిధిలో రైతులకు న్యాయం చేస్తా...

సొసైటీ పరిధిలో రైతులకు న్యాయం చేస్తా…

- Advertisement -

–నూతన సీఈఓ నరసింహుడు

విశాలాంధ్ర -ఆస్పరి (కర్నూలు జిల్లా) : ఆస్పరి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం (పిఎసిఎస్) సొసైటీ పరిధిలోని రైతులకు న్యాయం చేసేందుకు తన పూర్తి స్థాయి కృషి కొనసాగిస్తానని సీఈఓగా నరసింహుడు పేర్కొన్నారు. సోమవారం స్థానిక సొసైటీ కార్యాలయంలో నూతన బాధ్యతలు స్వీకరించిన సీఈఓ నరసింహుడు ను టిడిపి యూత్ నాయకులు సతీష్ కుమార్, మేకల రంగనాథ్, మారేష్, మహేష్ లు శాలువా పూలమాలలతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా సీఈఓ నరసింహుడు మాట్లాడుతూ రైతుల శ్రేయస్సే మా సొసైటీ లక్ష్యం అన్నారు. రైతులకు సకాలంలో రుణ సౌకర్యాలు, నాణ్యమైన విత్తనాలు, ఎరువులు, మరియు సాంకేతిక సహాయం అందించేందుకు ప్రాధాన్యత ఇస్తామని, అలాగే సొసైటీ కార్యకలాపాల్లో పారదర్శకత, నీతి, నిజాయితీని నిర్వహిస్తూ, రైతులకు న్యాయం జరిగేలా కృషి చేస్తానని తెలిపారు. రైతుల సమస్యలను తీర్చడానికి మరియు వారి సంక్షేమం కోసం సంస్థ ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటుందని టీడీపీ నాయకులకు సీఈఓ హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమాలలో సొసైటీ సిబ్బంది ఉషారాణి, లక్ష్మన్న, హనుమంతు రెడ్డి, లక్ష్మీనారాయణ, రైతులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు