విశాలాంధ్ర – పెద్దకడబూరు :(కర్నూలు) : మండల పరిధిలోని మేకడోన గ్రామంలో చిరుత పులి నుంచి ప్రజలను కాపాడాలని ఏఐవైఎఫ్ నాయకులు ఉసేన్ భాషా అధికారులను డిమాండ్ చేశారు. సోమవారం పెద్దకడబూరులో ఆయన విలేఖరులతో మాట్లాడుతూ మేకడోన గ్రామంలో గత రోజుల నుంచి చిరుత పులి సంచరిస్తుందని తెలిపారు. దీంతో గ్రామస్తులు వ్యవసాయ పనులు చేసుకోవడానికి పొలాలకు వెళ్లేందుకు ప్రాణాలను గుప్పెట్లో పెట్టుకొని వెళుతున్నారని ఆరోపించారు . గత వారం క్రితం పొలాల్లో చిరుత పులి కుక్కను తింటుండగా ప్రజలు చూసి అధికారులకు చెప్పినా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కావున ఇప్పటికైనా అటవీశాఖ అధికారులు స్పందించి చిరుత పులి నుంచి ప్రజలను కాపాడాలని లేని పక్షంలో గ్రామస్తులతో పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో నాయకులు రాజా రియాజ్, రఘు తదితరులు పాల్గొన్నారు.
చిరుత పులి నుంచి ప్రజలను కాపాడాలి
- Advertisement -
RELATED ARTICLES


