Homeజిల్లాలుశ్రీ సత్యసాయిపొజిషన్ సర్టిఫికెట్ కావాలని హౌసింగ్ శాఖ.. ఇప్పుడే ఇవ్వలేమని రెవెన్యూ శాఖ

పొజిషన్ సర్టిఫికెట్ కావాలని హౌసింగ్ శాఖ.. ఇప్పుడే ఇవ్వలేమని రెవెన్యూ శాఖ

- Advertisement -

అయోమయంలో పక్కా ఇళ్ల దరఖాస్తు దారులు.

అధికారుల తీరు మారకపోతే పక్కా గృహాల దరఖాస్తుదారులతో కలిసి పెద్ద ఎత్తున ఆందోళన చేస్తాం

చల్లా శ్రీనివాసులు… సిపిఐ పార్టీ మండల నాయకులు

విశాలాంధ్ర ముదిగుబ్బ/ధర్మవరం; పేదలకు పక్కా గృహాలు నిర్మించడంలో భాగంగా మండలంలో రెవెన్యూ, హౌసింగ్ అధికారుల మధ్య సమన్వయం లేకపోవడంతో పక్కా ఇళ్ల మంజూరుకు కావలసిన పోసిషన్ సర్టిఫికెట్లు సకాలంలో మంజూరు కాక దరఖాస్తు దారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ముదిగుబ్బలో జరిగిన విలేకరుల సమావేశంలో సిపిఐ నాయకులు చల్లా శ్రీనివాసులు ఆరోపించారు, ఈ మేరకు సిపిఐ పార్టీ మండల కార్యదర్శి చల్లా శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఆ పార్టీ నాయకులు మాట్లాడుతూ ప్రధాని గ్రామీణ స్వరాజ్ యోజన పథకం ద్వారా రాష్ట్రంలో నిరుపేదలకు ఇల్లు నిర్మించడంలో భాగంగా ముదిగుబ్బ మండలానికి కూడా 2 ,725 పక్క ఇల్లు మంజూరు అయినట్లు తెలిసిందన్నారు, దీంతో గత రెండు నెలల నుంచి మండల వ్యాప్తంగా అధికారులు దరఖాస్తులు స్వీకరిస్తున్న తరుణంలో పక్కా ఇళ్ల మంజూరుకు తప్పనిసరిగా పొజిషన్ సర్టిఫికెట్ అనగా నివాస స్థల ధ్రువీకరణ పత్రం కావాలని హౌసింగ్ అధికారులు నిబంధన పెట్టడంతో పాటు ఆ సర్టిఫికెట్ కూడా ఇంటికి దరఖాస్తు చేసేటప్పుడే సమర్పించాలని చెబుతున్న తరుణంలో మరోవైపు పోసిషన్ సర్టిఫికెట్ మంజూరు చేసే రెవెన్యూ అధికారులు మాత్రం పక్కా ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక జరిగిన తర్వాత ఆ జాబితాలో పేర్లు ఉన్న వారికి మాత్రమే ఆ సర్టిఫికెట్ మంజూరు చేస్తామని చెబుతుండడంతో ఇల్లు లేని పేదలు అయోమయానికి గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సకాలంలో ఇంటి కోసం దరఖాస్తు చేసుకోలేకపోతున్నారని సిపిఐ నాయకులు ఆవేదన చెందారు, కనుక ఇప్పటికైనా హౌసింగ్ రెవెన్యూ అధికారులు పక్కా ఇళ్ల దరఖాస్తుదాలను ఇబ్బందులు పెట్టకుండా వారికి తక్షణమే పొజిషన్ సర్టిఫికెట్ మంజూరు చేసి, సకాలంలో వారికి పక్కా ఇల్లు మంజూరు అయ్యేవిధంగా చర్యలు తీసుకోవాలని వారు విజ్ఞప్తి చేశారు, లేనిపక్షంలో త్వరలోనే పక్కా ఇళ్ల దరఖాసుదారులతో కలిసి సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేస్తామని ఈ సందర్భంగా వారు తెలియజేశారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు