Homeజిల్లాలుశ్రీ సత్యసాయికేరళలో జరిగిన జాతీయ డిజిటల్ ఫెస్ట్‌లో రిషి విద్యార్థులకు జాతీయ గుర్తింపు

కేరళలో జరిగిన జాతీయ డిజిటల్ ఫెస్ట్‌లో రిషి విద్యార్థులకు జాతీయ గుర్తింపు

- Advertisement -


విశాలాంధ్ర ధర్మవరం; కేరళ రాష్ట్రంలోని కన్నూర్‌లో నిర్వహించిన జాతీయ స్థాయి డిజిటల్ ఫెస్ట్ లో రిషి స్కూల్ విద్యార్థులు అసాధారణ ప్రతిభను ప్రదర్శించారు. ఈ పోటీలో ఇంటర్ వరకు దేశవ్యాప్తంగా అనేక పాఠశాలల, కళాశాలల నుంచి విద్యార్థులు పాల్గొనగా, మన రిషి స్కూల్‌కు చెందిన చిన్న వయసు విద్యార్థులు మాత్రమే ఈ స్థాయిలో పాల్గొని విజయం సాధించడం విశేషం అని డీల్ భాస్కర్, సీఏవో రవీంద్ర ప్రిన్సిపాల్ కరణ్ స్వరూప సింగ్ తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ
ఈ డిజిటల్ ఫెస్ట్‌ను యూకే ఆధారిత సంస్థ “సైబర్ స్క్వేర్” నిర్వహించగా, పోటీల్లో పాల్గొన్న సిరి, పంకజ్, పవన్ భార్గవ్,బింబమోహిత్, దివేష్, నిహస్వి, యశ్వంత్, తన్వి ప్రియ విద్యార్థులు తమ ప్రాజెక్టులు, డిజిటల్ నైపుణ్యాల వివరణను అద్భుతంగా వివరించి, అక్కడి అతిథులు, న్యాయనిర్ణేతలను మంత్రముగ్ధులను చేశారు. యూకే సైబర్ స్క్వేర్ వారు సర్టిఫికెట్లు ప్రదానం చేయడం సంతోషదాయకమన్నారు. విద్యార్థుల ప్రతిభ, ఉపాధ్యాయుల కృషి వల్లే జాతీయ స్థాయిలో ఈ గుర్తింపు లభించింది” అని తెలిపారు.ఈ ఘన విజయాన్ని సాధించిన విద్యార్థులకు రిషి స్కూల్ ఏఓ రంగా రెడ్డి ఉపాధ్యాయులు, సిబ్బంది హృదయపూర్వక అభినందనలు తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు