Homeజిల్లాలుశ్రీ సత్యసాయిరెవెన్యూ క్లినిక్ లో ప్రతి సమస్యకు పరిష్కారం చూపడమే మా ధ్యేయం

రెవెన్యూ క్లినిక్ లో ప్రతి సమస్యకు పరిష్కారం చూపడమే మా ధ్యేయం

- Advertisement -

ఆర్డీవో మహేష్
విశాలాంధ్ర ధర్మవరం;; రెవెన్యూ క్లినిక్ లో ప్రతి సమస్యకు పరిష్కారం చట్ట ప్రకారం చూపడమే మా ధ్యేయము అని ఆర్డిఓ మహేష్ తెలిపారు. ఈ సందర్భంగా ప్రభుత్వం ప్రవేశపెట్టిన”రెవెన్యూ క్లినిక్”కార్యక్రమం పట్టణంలోని ఆర్డిఓ కార్యాలయంలోని కోర్టు ఆవరణ నందు ఆర్డీవో అధ్యక్షతన నిర్వహించడం జరిగింది. రెవెన్యూ డివిజన్ పరిధిలోని ధర్మవరం, బత్తలపల్లి, కనగానపల్లి, ముదిగుబ్బ, తాడిమర్రి, చెన్నై కొత్తపల్లి, రామగిరి మండలాల నుండి ప్రజలు, రైతుల ద్వారా 83 దరఖాస్తులు రావడం జరిగిందని, వాటిని ఆయా మండలాల తహసిల్దార్ ద్వారా అప్పటికప్పుడే పరిష్కరించి, పరిష్కారానికి కావలసిన అంశాలపై పెండింగ్ వివరాలను తెలుసుకుంటూ, అన్ని అర్హతలు న్యాయంగా ఉన్న 5 మాత్రమే పరిష్కారం కావడం జరిగిందని తెలిపారు. మిగిలిన దరఖాస్తులను త్వరితగతంగా విచారణ చేపట్టి ఆయా మండలాల తాసిల్దార్ల ద్వారా సమాచారాన్ని సేకరించి లబ్ధిదారునికి న్యాయం చేకూర్చుతామని తెలిపారు. మొత్తం మీద ఉదయం 9:30 గంటల నుండి మధ్యాహ్నం మూడు గంటల వరకు రెవెన్యూ క్లినిక్ కొనసాగింది. నిరంతరం ఆర్డీవో మహేష్ సమక్షంలో ఐదు కౌంటర్లను ఏర్పాటు చేసి, ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేస్తూ అధికారులను, దరఖాస్తుదారులను ప్రోత్సహిస్తూ సమస్య పరిష్కారానికి కృషి చేయడం జరిగిందని వారు తెలిపారు. ఇందుకు పోలీసు వ్యవస్థ కూడా ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. వివిధ రాజకీయ పార్టీ నాయకులు కూడా మండల సమస్యలపై నెలకొన్న వాటి వివరాలను దరఖాస్తు ద్వారా ఇవ్వడం జరిగిందని తెలిపారు. రెవెన్యూ ప్రజలకు భూ రెవెన్యూ సంబంధిత సమస్యల పరిష్కారంలో సౌలభ్యం కల్పించేందుకే ఈ రెవెన్యూ క్లినిక్ ను నిర్వహించినందుకు చాలా సంతోషంగా ఉందని తెలిపారు. భూ సమస్యలు, ముయ్టిషన్, పట్టాదారు పాసుబుక్ సవరణ, 22-ఏ నిషేధిత జాబితా సమస్యలు, ఖాతా నవీకరణ, ఇతర రెవెన్యూ సంబంధిత అంశాలు రావడం జరిగిందని తెలిపారు. ఇటీవల రాజముద్రతో పంపిణీ చేసిన రైతులకు, రీ సర్వేలో చేసిన వాటికి కొంత తేడాలు రావడంతో వాటిని కూడా పరిగణలోనికి తీసుకొని తప్పిదం ఎక్కడ జరిగింది అన్న వాటిపై వేగవంతంగా నిర్ణయాలు తీసుకొని రైతులకు న్యాయం చేస్తామని తెలిపారు. నిబంధనల ప్రకారం తక్షణ పరిష్కారం అందించడానికి అన్ని చర్యలు చేపట్టడం జరిగిందని తెలిపారు. ఎప్పటికప్పుడు జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్లకు సమాచారాన్ని అందించి సత్వరంగా న్యాయం జరిగేలా కృషి చేస్తామని తెలిపారు. ప్రజలకు ప్రభుత్వ సేవలను తక్షణమే పారదర్శకంగా సౌకర్యవంతంగా పొందగలిగేలా లక్ష్యంగా అధికారులు పనిచేస్తున్నారని తెలిపారు. అంతేకాకుండా రెవెన్యూ కార్యకలాపాలలపై అవగాహన కార్యక్రమాన్ని కూడా నిర్వహించామని తెలిపారు. రెవెన్యూ క్లినిక్ కార్యక్రమం ప్రజలకు ప్రభుత్వ సేవలో చేరువలో నాణ్యత వేగవంతమైన పరిష్కారం ప్రజాస్వామ్యపరంగా అధికారులతో ప్రత్యక్ష పరిష్కారం కల్పించడం వంటి ప్రయోజనాలను అందించడం జరుగుతున్నదని తెలిపారు. ఈ కార్యక్రమంలో డివిజన్ పరిధిలోని ఏడు మండలాల తహసీల్దారులు, ఆర్డీవో కార్యాలయ అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్ కతిజూన్ కుప్రా, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు