Homeజిల్లాలుశ్రీ సత్యసాయిజిల్లా స్థాయి పోటీలకు ఎంపికైన రిషి విద్యాలయ పాఠశాల విద్యార్థులు

జిల్లా స్థాయి పోటీలకు ఎంపికైన రిషి విద్యాలయ పాఠశాల విద్యార్థులు

- Advertisement -

ప్రిన్సిపాల్ కరణ్ స్వరూప సింగ్
విశాలాంధ్ర ధర్మవరం:: జిల్లా స్థాయి పోటీలకు పట్టణంలోని రుషి విద్యాలయ పాఠశాల విద్యార్థులు ఎంపిక కావడం జరిగిందని ప్రిన్సిపాల్ కరణ్ స్వరూప సింగ్ తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మండల స్థాయి ఎస్జీఎఫ్ ఆటల పోటీలలో జిల్లా సాయికి ఎంపిక కావడం జరిగిందన్నారు. మండల స్థాయిలో యోగా చేస్తూ కోకో ఆటల పోటీలు నిర్వహించగా, మా విద్యార్థులు ప్రతిభ కనబరచడం జరిగిందని తెలిపారు. విద్యార్థులకు క్రీడల యొక్క ప్రాముఖ్యతను కూడా వివరించడం జరిగిందని తెలిపారు చదువుతోపాటు ఆటలు ఆడటం వల్ల వచ్చే ఆరోగ్య ప్రయోజనాలు కూడా వివరించడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ కళ్యాణి ,ఏవో రంగారెడ్డి, పి ఈ టి గణేష్, ముత్తు, పాఠశాల ఉపాధ్యాయ బృందం తోటి విద్యార్థులు అభినందన శుభాకాంక్షలు ఎంపికైన వారికి తెలియజేశారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు