విశాలాంధ్ర పుట్టపర్తి:-రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన మహిళలకు స్రీ శక్తి పథకం ఎంతో లాభదాయకంగా ఉందని జిల్లా ప్రజా రవాణాధికారి మధుసూదన్ పేర్కొన్నారు. సోమవారం పుట్టపర్తి బస్ స్టేషన్లో స్రీ శక్తి పథకం ద్వారా మహిళలకు ప్రయాణ సౌకర్యం గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మధుసూదన్ మాట్లాడుతూ ఈ పథకం అమలు జరిగిన తర్వాత సత్యసాయి జిల్లాలో మహిళలు అధిక సంఖ్యలో లబ్ధి పొందుతున్నారన్నారు. జిల్లాలో ఈ పథకం ప్రారంభమైన మూడు రోజులలో 75, 402 మంది మహిళలు ప్రయాణం చేశారన్నారు. మహిళలు ప్ర,13,977 రూపాయలు ఈ పథకం ద్వారా మహిళలు లబ్ధి పొందారున్నారు. బస్సులలో ప్రయాణించే మహిళలు ఈ పథకాన్ని మరింతగా ఉపయోగించుకోవాలని సూచించారు. మహిళా ప్రయాణికులకు కండక్టర్ డ్రైవర్లు సహకరించాలని కోరుతున్నామన్నారు. ఈ పథకాన్ని ప్రయాణికులు మరింతగా ఆదరించి లబ్ధి పొందాలని కోరుతున్నామన్నారు.
మహిళలకు స్రీ శక్తి పథకం లాభదాయకం.. జిల్లా ప్రజా రవాణా అధికారి మధుసూదన్
- Advertisement -
RELATED ARTICLES


