Homeజిల్లాలుశ్రీ సత్యసాయిపాక్ ఉగ్రవాద సంస్థలతో సంబంధాలున్న ఉగ్రవాది అరెస్ట్... జిల్లా ఎస్పీ రత్న

పాక్ ఉగ్రవాద సంస్థలతో సంబంధాలున్న ఉగ్రవాది అరెస్ట్… జిల్లా ఎస్పీ రత్న

- Advertisement -

విశాలాంధ్ర పుట్టపర్తి:- పాకిస్తానీ నిషేధిత ఉగ్రవాద సంస్థలతో సంబంధాలు ఉన్న ఉగ్రవాదిని అరెస్టు చేసినట్లు శ్రీ సత్యసాయి జిల్లా ఎస్పీ రత్న పేర్కొన్నారు. ఆదివారం జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎస్పీ విలేకరులతో మాట్లాడుతూ దేశ వ్యతిరేక ప్రచారం, పాకిస్తానీ నిషేధిత ఉగ్రవాద సంస్థలతో పలు వాట్సప్ గ్రూపుల్లో సంబంధాలు కలిగి ఉన్న ఓ వ్యక్తిని శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం పోలీసులు అరెస్టు చేశారన్నారు .ధర్మవరం పట్టణంలో బిర్యానీ వంటకాల తయారీదారుడుగా జీవనం సాగిస్తున్న నూర్ మహమ్మద్ అనే వ్యక్తి జైషే – ఈ- మహమ్మద్, సదాయి జిహాదీ, మగ్బూజి కి ఆవాజ్, నజ్రియాతి వంటి సంస్థలకు సంబంధించిన 36 వాట్స్అప్ గ్రూపుల్లో సభ్యులుగా ఉన్నట్లు గుర్తించామన్నారు. నూర్ మహమ్మద్ తరచూ సంబంధిత గ్రూప్ సభ్యులతో భావాలు పంచుకునే వాడని తెలియజేశారన్నారు .మజీదుల వద్ద ప్రార్థనల అనంతరం అక్కడ యువకులతో సంబంధిత సమాచారాన్ని పంచుకున్నట్లు గుర్తించామన్నారు. ఏదైనా ఉగ్ర సంస్థలు శిక్షణ ఇచ్చేందుకు ఆహ్వానిస్తే వెళ్లేందుకు ఇతను సిద్ధంగా ఉన్నట్లు తెలియజేశారు. చూడడానికి అమాయకుడిలా కనిపించే నూర్ మహమ్మద్ ఇంకా ఏవైనా ఉగ్రవాద సంస్థలతో సంబంధాలు కలిగి ఉన్నారా అన్న విషయాలను కూడా అవసరమైతే అతన్ని అదుపులోకి తీసుకొని సమాచారం రాబడతామన్నారు. అతని వద్ద స్వాధీనం చేసుకున్న మొబైల్ ఫోన్, రెండు సిమ్ కార్డులను పో రెన్సీక్ ల్యాబ్ కు పంపించామని అక్కడ నుంచి వచ్చే నివేదిక ఆధారంగా దర్యాప్తు చేపడుతామన్నారు. ఈ కార్యక్రమంలో ఇన్చార్జి డిఎస్పి నర్సింగప్ప, ధర్మవరం రూరల్ సీఐ రెడ్డప్ప తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు