మున్సిపల్ కమిషనర్ సాయి కృష్ణ
విశాలాంధ్ర ధర్మవరం;; పట్టణానికి కావలసిన త్రాగునీటిని దృష్టిలో ఉంచుకొని ఈనెల 20వ, 21వ, 22వ తేదీలలో (మూడు రోజులపాటు) పట్టణంలో నీటి సుబ్బారావు ఉండదని మున్సిపల్ కమిషనర్ సాయి కృష్ణ తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ పార్లపల్లి డ్యాం నుండి తంబాపురం వరకు, తంబాపురం నుండి తిక్క స్వామి నగర వద్ద గల ఫిల్టరేషన్ ప్లాంట్ కు వద్ద మోటార్ల ద్వారా పట్టణానికి నీరును పంపిణీ చేస్తున్నామని తెలిపారు. తంబాపురం వాటర్ వర్క్స్ వద్ద ఉన్న ఎమ్మెస్ మ్యాని ఫోల్డ్ చాలా సంవత్సరాలు కావడం వలన బాగా దెబ్బతిని నీరు వృధాగా పోతున్నాయని తెలిపారు. దాని స్థానంలో కొత్త ఎమ్మెస్ మ్యాన్ ఫోల్డ్ తయారు చేసి బిగించడం కొరకు మూడు రోజుల సమయం పడుతుందని, అందుకనే మూడు రోజులపాటు పట్టణంలో నీటి సరఫరా ఉండదని వారు తెలిపారు. కావున పట్టణ ప్రజలు గమనించి సహకరించాలని, అదేవిధంగా మున్సిపల్ నీటిని వృధా చేయకుండా పొదుపుగా వాడుకోవాలని తెలిపారు.
పట్టణంలో మూడు రోజులపాటు నీటి సరఫరా ఉండదు
- Advertisement -
RELATED ARTICLES


