శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయ కమిటీ
విశాలాంధ్ర ధర్మవరం;; భక్తుల సహాయ సహకారములతోనే అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయ కమిటీ సభ్యులు పేర్కొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతిరోజు వచ్చే భక్తాదులు తమ వంతుగా 100 రూపాయల నుంచి ఆపై వరకు ఇచ్చిన నగదుకు తాము రసీదులను కూడా ఇస్తున్నామని తెలిపారు. ప్రతిరోజు నూరు మందికి అన్నదాన కార్యక్రమాన్ని చేపడుతున్నామని తెలిపారు. మరికొన్ని సేవా కార్యక్రమాలను కూడా త్వరలో చేపడతామని తెలిపారు. ప్రతి శనివారం వెంకటేశ్వర స్వామికి ప్రత్యేక పూజలతో పాటు ఆలయ ఆవరణములో పల్లకి సేవను కూడా నిర్వహిస్తున్నామని తెలిపారు. ఇటువంటి కార్యక్రమాలకు భక్తాదులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులు ఆగుతున్నారని తెలిపారు. ప్రతి విరాళానికి రసీదు తప్పనిసరిగా ఆలయ కమిటీ ద్వారా ఇస్తున్నామని వారు స్పష్టం చేశారు.


