- Advertisement -
రజని, రక్తబంధం ట్రస్ట్ అధ్యక్షులు కన్నా వెంకటేష్
విశాలాంధ్ర ధర్మవరం;; అన్నదానం చేయటలో ఎంతో సంతృప్తి ఉంటుంది అని రజని, రక్త బంధం ట్రస్ట్ అధ్యక్షులు కన్నా వెంకటేష్, మాజీ కౌన్సిలర్ కేత లోకేష్ తెలిపారు. ఈ సందర్భంగా వారు పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో 130 మందికి అల్పాహారాన్ని అందజేశారు. ఈ కార్యక్రమానికి దాతలుగా ధర్మారం చెందిన విజయ రాఘవేంద్ర, మాధవి లత, కూతురు సత్యమేఘన వ్యవహరించడం జరిగిందని, వారికి ట్రస్ట్ తరఫున ప్రత్యేక కృతజ్ఞతలను తెలియజేశారు. ఇటువంటి సేవా కార్యక్రమాలకు దాతగా తాము ఉండడం నిజంగా గర్వించదగ్గ సంతోషించదగ్గ విషయమని విజయ రాఘవేంద్ర తెలిపారు


