Homeఆంధ్రప్రదేశ్ఒకటవ తేదీకి లబ్ధిదారులకు రేషన్ కార్డులు అందేనా?

ఒకటవ తేదీకి లబ్ధిదారులకు రేషన్ కార్డులు అందేనా?

- Advertisement -

– పంపిణీలో గందరగోళం లబ్ధిదారులకు తప్పని ఇక్కట్లు 

విశాలాంధ్ర – సీతానగరం: ఒకటవ తేదీకి లబ్ధిదారులకు రేషన్ కార్డులు అందేనా?. మండల వ్యాప్తంగా 21 గ్రామ పంచాయతీల పరిధిలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన విప్లవాత్మక మార్పులో ఒకటి అయినా హరిహులు అయినా లబ్ధిదారులకు స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీ ఒకటి. ఈ పంపిణీ ప్రక్రియ ఒక పద్ధతిలో జరగకపోవడం వలన పూర్తి స్థాయిలో లబ్ధిదారులకు అందని స్మార్ట్ కార్డులు. ఈ పంపిణీ ఒకే చోట చేయడం, పంపిణీ నమోదు చేసే వెబ్సైట్ సరిగా పని చేయకపోవడంతో లబ్ధిదారులకు తప్పని ఇక్కట్లు. పంపిణీ చేసే ప్రక్రియ పై మండల అధికారుల పర్యవేక్షణ లేక పోవడంతో తమ ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు అని ప్రజలు ఆరోపిస్తున్నారు. అలాగే ఈ రేషన్ కార్డులలో కొంత మంది లబ్ధిదారులకు రాకపోవడంతో గందరగోళం ఏర్పడుతుంది. ఈ సమస్యల పై ఉన్నత అధికారులు దృష్టి సారించి ప్రభుత్వ లక్ష్యాలను చేరుకునే విధంగా లబ్ధిదారులు అయినా ప్రజలు ఇబ్బందులు కలగ కుండా అధికారులు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు