Homeతెలంగాణ‘తెలంగాణ రైజింగ’లో భాగమవ్వండి

‘తెలంగాణ రైజింగ’లో భాగమవ్వండి

- Advertisement -

. ‘ఇండియా పెవిలియన’ సదస్సులో దిగ్గజ పారిశ్రామికవేత్తలకు మంత్రి శ్రీధర్‌బాబు పిలుపు
. పారిశ్రామికాభివృద్ధికి అవకాశాలు పుష్కలం

విశాలాంధ్ర – హైదరాబాద్ : ‘ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస’లో ఇతర రాష్ట్రాలకు రోల్ మోడల్ గా నిలిచిన రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టి ‘తెలంగాణ రైజింగ’లో భాగస్వామ్యం కావాలని దిగ్గజ పారిశ్రామికవేత్తలను రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు కోరారు. పారిశ్రామికాభివృద్ధికి అన్ని రకాలుగా అనుకూలంగా ఉన్న తెలంగాణతో కలిసి పని చేసేందుకు, రాష్ట్రాభివృద్ధిలో పాలు పంచుకునేందుకు ముందుకు రావాలని వారిని సాదరంగా ఆహ్వానించారు. మంగళవారం వరల్డ్ ఎకనామిక్ ఫోరం(డబ్ల్యూఈఎఫ్) వార్షిక సదస్సులో భాగంగా దావోస్ లో ఏర్పాటు చేసిన ‘ఇండియా పెవిలియన’ ప్రారంభోత్సవంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధిగా ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ… భవిష్యత్తు కోసం ఎదురు చూడకుండా దానిని నిర్మించాలన్నదే తమ ప్రభుత్వ సంకల్పమన్నారు. 2047 నాటికి దేశ జీడీపీలో తెలంగాణ వాటాను 10 శాతానికి చేర్చాలనే లక్ష్యానికనుగుణంగా దార్శనికతతో కూడిన ప్రణాళికా బద్ధమైన అడుగులు వేస్తున్నామన్నారు. తెలంగాణ ఆర్థిక వ్యవస్థను 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్లకు చేర్చేలా నిపుణులు, పారిశ్రామికవేత్తలు, ప్రజల భాగస్వామ్యంతో సమగ్ర ప్రణాళిక ను సిద్ధం చేశామన్నారు. ఈ విజన్ డాక్యుమెంట్ లో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు ఊతమిచ్చే కీలక రంగాలకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చామన్నారు. ఫార్మా, లైఫ్ సైన్సెస్, బయో టెక్నాలజీ, హెల్త్ కేర్ ఇన్నోవేషన్, ఎలక్ట్రానిక్స్, సెమీ కండక్టర్స్, హార్డ్ వేర్ మాన్యుఫ్యాక్చరింగ్, ఐటీ, ఐటీఈఎస్, ఏరో స్పేస్, డిఫెన్స్, టెక్స్ట్ టైల్, అప్పారెల్ మాన్యుఫ్యాక్చరింగ్, ఫుడ్ ప్రాసెసింగ్, ఆగ్రో బేస్డ్ ఇండస్ట్రీస్, రెన్యువబుల్ ఎనర్జీ, గ్రీన్ టెక్నాలజీస్ తదితర రంగాలకు సంబంధించి తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు ఉన్న అనుకూలతలు, అవకాశాలు, ఎకో సిస్టం గురించి వివరించారు. రాష్ట్రానికి కొత్త పరిశ్రమలను తీసుకొచ్చి… యువతకు ఉపాధి అవకాశాలను కల్పించేందుకు చిత్తశుద్ధితో కృషి చేస్తున్నామన్నారు. దావోస్ వేదికగా తమ ప్రభుత్వం గత రెండేళ్లలో సుమారు రూ.2.5 లక్షల కోట్ల పెట్టుబడులను సమీకరించిందని మంత్రి తెలిపారు. ఈ ఏడాది కూడా అదే స్ఫూర్తితో పారిశ్రామికాభివృద్ధికి ఊతమిచ్చేలా రూపొందించిన పాలసీలను వివరించి, దిగ్గజ కంపెనీలు తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చేలా కృషి చేస్తామన్నారు. ‘తెలంగాణ బ్రాండ’ మరింతగా విశ్వవ్యాప్తం అయ్యేలా లైఫ్ సైన్సెస్ పాలసీ 2.0, తెలంగాణ ఏఐ ఇన్నోవేషన్ హబ్(టీఏఐహెచ్) ను దావోస్ వేదికగా లాంఛనంగా ఆవిష్కరిస్తామన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు