న్యూఢిల్లీ: జాతీయ క్రీడా పురస్కారాలను కేంద్ర ప్రభుత్వం మంగళవారం ప్రకటించింది. 2025 సంవత్సరానికిగాను 17 మందిని అర్జున అవార్డులు వరించగా… అత్యున్నత క్రీడా పురస్కారమైన మేజర్ ధ్యాన్‌చంద్ ఖేల్‌రత్న అవార్డును ఈ ఏడాది ఎవరికీ ప్రకటించలేదు. సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి అరుణ్ కుమార్ మిశ్రా నేతృత్వంలోని ఎంపిక కమిటీ దేశ అత్యున్నత క్రీడా పురస్కారమైన ఖేల్‌రత్న కోసం హాకీ స్టార్ హార్దిక్ సింగ్ పేరు పరిశీలించినప్పటికీ చివరకు ఆయన ఆ రేసు నుంచి వైదొలిగారు. అథ్లెటిక్స్ విభాగంలో అర్జున అవార్డులు పొందిన వారిలో తేజస్విన్ శంకర్, మహమ్మద్ అజ్మల్ వి, ప్రియాంక గోస్వామి ఉన్నారు. ట్రీసా జాలీ, పుల్లెల గాయత్రి గోపీచంద్(బ్యాడ్మింటన్), నరేందర్ బెర్వాల్(బాకిస్ంగ్), విదిత్ సంతోష్ గుజరాతి, దివ్యా దేశ్‌ముఖ్(చెస్), పారా షూటింగ్లో ధనుష్ శ్రీకాంత్, హాకీలో లాల్రెమ్సియామి, రాజ్‌కుమార్ పాల్, కబడ్డీలో సుర్జీత్, పూజ, పారాషూటింగ్‌లో రుద్రాంశ్ ఖండేల్వాý, పారాఅథ్లెటిక్స్లో ఏక్తా భ్యాన్, రోయింగ్‌లో అరవింద్ సింగ్, షూటింగ్లో అఖిల్ షియోరాన్ అర్జున అవార్డుకు ఎంపికయ్యారు. అర్జున అవార్డు (లైఫ్‌టైమ్) పొందిన వారిలో అరుమై నాయగం (ఫుట్‌బాల్) ఉన్నారు. ఛోటే లాల్ యాదవ్ (బాకిస్ంగ్), పర్వీర్ సింగ్ (అథ్లెటిక్స్), నేహా నందకుమార్ చవాన్ (షూటింగ్) ద్రోణాచార్య అవార్డులు (కోచ్‌లు) గెలుచుకున్నారు. లైఫ్‌టైమ్ కేటగిరీలో ధర్మేంద్ర సింగ్ యాదవ్ (బాకిస్ంగ్), వీరేందర్ కుమార్ (రెజ్లింగ్) ఉన్నారు.


