- ఎస్సీ, ఎస్టీ కోటా యథాతథం – ప్రత్యక్ష విధానంలో మేయర్, చైర్మన్ ఎన్నిక
- అక్టోబరులోనే స్థానిక ఎన్నికలు – కార్పొరేషన్లు, మున్సిపాలిటీ చట్టాలకు సవరణలు
- 13 నుంచి 28కి జెడ్పీల వికేంద్రీకరణ – 10,060 పోస్టులతో ‘జాబ్ క్యాలెండర్ 2026-27’
- పరిశ్రమల స్థాపనకు పెద్ద ఎత్తున భూ కేటాయింపులు – రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయాలు
విశాలాంధ్ర – సచివాలయం: రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో గ్రామీణ స్థానిక సంస్థలలో బీసీలకు 34శాతం కోటాను ఖరారు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. మంగళవారం రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో అనేక కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ముఖ్యంగా రాజధాని అమరావతి మౌలిక వసతులు, భారీ పారిశ్రామిక ఇన్వెస్ట్మెంట్లు, నూతన ఉద్యోగ నియామకాలు, మరియు పురపాలక-గ్రామీణ ప్రాంతాల్లో పరిపాలనా సంస్కరణలకు సంబంధించి దాదాపు 63 అజెండా అంశాలకు కేబినెట్ ఏకగ్రీవ ఆమోదం తెలిపింది. కేంద్ర ప్రభుత్వం నుంచి స్థానిక సంస్థలకు తక్షణమే రావాల్సిన వేల కోట్ల నిధులను పొందడం అత్యంత ప్రాధాన్య అంశమని భావించిన మంత్రివర్గం… పట్టణ, గ్రామీణ స్థానిక సంస్థలకు అక్టోబర్ లో ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయించింది. ఈ ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు ఖరారు చేసింది. గ్రామీణ స్థానిక సంస్థల్లో వెనుకబడిన తరగతులకు 34 శాతం, పట్టణ స్థానిక సంస్థల్లో 33 శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ప్రస్తుతం ఉన్న ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లలో ఎలాంటి మార్పు లేకుండా యథాతథంగా కొనసాగుతాయని స్పష్టం చేసింది. బీసీ రిజర్వేషన్ల కోసం ఏర్పాటైన డెడికేటెడ్ కమిషన్ నివేదిక ప్రక్రియ ముగింపు దశలో ఉన్నట్లు అధికారులు మంత్రివర్గానికి వివరించారు. ఇకపై నగరపాలక సంస్థల (కార్పొరేషన్లు) మేయర్లు, మున్సిపాలిటీలు, నగర పంచాయతీల చైర్పర్సన్లను పరోక్ష పద్ధతిలో కాకుండా ప్రజలే నేరుగా ఓటు వేసి ఎన్నుకునేలా ప్రత్యక్ష ఎన్నికల విధానాన్ని అమలు చేయనుంది. దీనికోసం మునిసిపల్ కార్పొరేషన్ల చట్టం 1955 (సెక్షన్ 90) ఆంధ్రప్రదేశ్ మునిసిపాలిటీల చట్టం 1965 (సెక్షన్ 23) లలో కీలక సవరణలు చేస్తూ బిల్లును రాబోయే అసెంబ్లీ సమావేశాల్లో ప్రవేశపెట్టేందుకు ఆమోదం తెలిపింది. కొత్త జిల్లాల విభజనకు అనుగుణంగా పరిపాలనా యంత్రాంగాన్ని ప్రజలకు మరింత చేరువ చేసేందుకు ప్రస్తుతం ఉన్న 13 జిల్లా పరిషత్‌ల స్థానంలో 28 జిల్లా పరిషత్‌లు ఏర్పాటు చేసే కార్యాచరణకు పచ్చజెండా ఊపింది. ‘జాబ్ క్యాలెండర్ 2026-27’ కింద ఏపీపీయస్సీ , ఏపీఎస్ఏల్పీఆర్బీ, డీఎస్సీ ల ద్వారా వివిధ ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న 10,060 పోస్టులను ప్రత్యక్ష పద్ధతిన భర్తీ చేయడానికి ఆర్థిక శాఖ సమర్పించిన నివేదికకు మంత్రివర్గం పచ్చజెండా ఊపింది. అలాగే కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ చట్టం, 2023 (యాక్ట్ నం. 30/2023) షెడ్యూల్లో ‘డైరెక్టరేట్ ఆఫ్ సెకండరీ హెల్త్’ ను చేర్చుతూ సవరణ చేశారు. మారుమూల ప్రాంతాల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు ఊరటనిస్తూ రంపచోడవరం, మార్కాపురం, మదనపల్లె జిల్లా కేంద్రాల్లో హెచ్ఆర్ఏ ను 12శాతం నుండి 16శాతంకి పెంచారు. రాయచోటిలో పనిచేస్తున్న ఉద్యోగులకు 16శాతం హెచ్ఆర్ఏ రద్దుకు ఆమోదం తెలిపింది.
విశాఖలో రూ 1.76 లక్షల కోట్ల హైపర్-స్కేల్ డేటా సెంటర్వి శాఖపట్నంలో ఆనందపురం మండలం జగనన్నాథపురం వద్ద రూ 1,76,534 కోట్ల అంచనా వ్యయంతో (అర్హతగల మూలధన తరహాలోనే మండలిలోనూ ప్రత్యేక సమయం కేటాయించి చర్చించేందుకు ప్రభుత్వం ఎందుకు వెనుకంజ వేస్తోందని, నిరుద్యోగుల సందేహాలను నివృత్తి చేయాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వానికి లేదా అని ప్రశ్నించారు. వేరే రూపంలో ప్రతిపాదనలు తీసుకురావాలని చైర్మన్ సూచించినప్పటికీ వైసీపీ సభ్యులు ఆందోళన కొనసాగించారు.
అల్లరి చేసి వెళ్లడమే విపక్ష పని : పయ్యావుల కేశవ్
విపక్ష నేత బొత్స వ్యాఖ్యలు, వైసీపీ సభ్యుల ఆందోళనపై ఆర్థిక, సభా వ్యవహారాల మంత్రి పయ్యావుల కేశవ్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ‘సభలో ప్రజా సమస్యలపై చర్చించడం వైసీపీ సభ్యులకు ఎంతమాత్రం ఇష్టం లేదు. కేవలం సభను అడ్డుకోవడం, రచ్చ చేయడం, అల్లరి చేసి బయటకు వెళ్లిపోవడమే వారి లక్ష్యం. డీఎస్సీ అంటేనే గుర్తుకొచ్చేది తెలుగుదేశం పార్టీ. మా పాలనలో ఏకంగా 14 సార్లు డీఎస్సీలు నిర్వహించి వేలాది ఉద్యోగాలు ఇచ్చాం. గత ప్రభుత్వంలో విద్యాశాఖ మంత్రిగా పని చేసి… తన ఐదేళ్ల హయాంలో ఒక్క డీఎస్సీ కూడా ఇవ్వని బొత్స సత్యనారాయణ… ఈ రోజు నిరుద్యోగుల పట్ల ప్రేమ ఉన్నట్లు మాట్లాడటం విడ్డూరంగా ఉంది’ అని పయ్యావుల కేశవ్ ఎద్దేవా చేశారు. మండలి చైర్మన్ స్థానానికి కనీస గౌరవం ఇవ్వకుండా వైసీపీ సభ్యులు ప్రవర్తిస్తున్నారని, ప్రజలు ఇచ్చిన తీర్పు ప్రకారమే తాము సభా వ్యవహారాలు నడుపుతామని పయ్యావుల తేల్చిచెప్పారు. సభను సజావుగా నిర్వహించేందుకు సహకరించాలని, అంశాలను బిజినెస్ అడ్వైజరీ కమిటీలో నిర్ణయిద్దామని చైర్మన్ విజ్ఞప్తి చేసినా… రెండు పక్షాల హోరాోరీ నినాదాలతో సభ తీవ్ర రసాభాసగా మారడంతో చైర్మన్ సభను వాయిదా వేశారు.
వైసీపీ ఎమ్మెల్సీలు ర్యాలీగా అసెంబ్లీకి…
డీఎస్సీ అక్రమాలపై చర్చకు పట్టుబడుతూ వైసీపీ ఎమ్మెల్సీలు ర్యాలీగా అసెంబ్లీకి వచ్చారు. ఆ సమయంలో పోలీసులు వాళ్లను అడ్డుకోవడంతో వాగ్వాదం చోటు చేసుకుంది. డీఎస్సీ అక్రమాలపై విచారణ జరిపించాలని, మంత్రి నారా లోకేశ్ రాజీనామా చేయాలంటూ నినాదాలు చేస్తూ వైసీపీ ఎమ్మెల్సీలు ఫ్లెక్సీలతో గేటు వద్ద నుంచి ర్యాలీగా బయలుదేరారు. ఆ సమయంలో పోలీసులు వాళ్లను అడ్డుకుని బారికేడ్లు అడ్డుపెట్టారు. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన ఎమ్మెల్సీలు పోలీసులతో వాగ్వాదానికి దిగారు.


