Homeజిల్లాలుశ్రీ సత్యసాయిట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు..

ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు..

- Advertisement -

విశాలాంధ్ర పుట్టపర్తి:- ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని పట్టణ ఎస్ఐ ఉమాదేవి పేర్కొన్నారు. మంగళవారం గణేష్ కూడలిలో వాహనాలు తనిఖీ నిర్వహించారు.వాహనదారుల లైసెన్స్, వాహన రికార్డులను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఎస్సై ఉమాదేవి మాట్లాడుతూ హెల్మెట్, సీట్ బెల్ట్ వాడని వారికి, రోడ్డు భద్రతా నియమాలు పాటించని వారికి జరిమానాలు విధిస్తామన్నారు. ప్రజలకు రోడ్డు భద్రత, ప్రమాదాలు, ట్రాఫిక్ నిబంధనల పై అవగాహన కల్పించారు. బైక్ లు నడిపే వారు ఖచ్చితంగా హెల్మెట్లు ధరించాలని, ఓవర్ స్పీడ్, ఓవర్ లోడ్ తో వాహనాలు వెళ్ళకూడదని, డ్రంకెన్ డ్రైవ్ చేయరాదన్నారు .ప్రతి ఒక్కరు రోడ్డు భద్రతా నియమాలు పాటించాలని లేనిచో చట్టపరంగా చర్యలు తీసుకుంటామని ఉమాదేవి హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు