కరెస్పాండెంట్ భాస్కర్ రెడ్డి
విశాలాంధ్ర ధర్మవరం;; పట్టణంలోని రేగాటిపల్లి రోడ్డు,శ్రీ వివేకానంద డిగ్రీ కళాశాల నందు రెండు రోజులలో జరిగిన జాబ్ మేళాలో 48 మంది ఎంపిక కావడం జరిగిందని కరెస్పాండెంట్ భాస్కర్ రెడ్డి, డైరెక్టర్ బాలం లక్ష్మీనారాయణరెడ్డి, ప్రిన్సిపాల్ కరణం హర్షవర్ధన్ తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ ఈ జాబ్ మేళాలో హైదరాబాదు నిర్మాణ్ ఆర్గనైజేషన్ వారి ఆధ్వర్యంలో నిర్వహించిన జాబ్ మేళా నందు దాదాపు 250 మందికి పైగా అభ్యర్థులు పాల్గొన్నారని తెలిపారు. ఈ జాబ్ మేళాలో మొత్తం 7 కంపెనీలు పాల్గొనగా 48 మంది అభ్యర్థులకు ఉద్యోగ అవకాశాలు లభించాయని, 30 మంది అభ్యర్థులు తదుపరి రౌండ్ కొరకు ఎంపిక అయ్యారని తెలిపారు. ఎంపికైన అభ్యర్థులకు1.98 లక్షల నుండి 2.6 లక్షల వార్షిక వేతనం అందుతుందని తెలిపారు. ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కళాశాల చైర్మన్ చిన్నప్పరెడ్డి మాట్లాడుతూ ఈ జాబ్ మేళాను సద్వినియోగం చేసుకున్న ప్రతి ఒక్క అభ్యర్థికి అభినందనలు తెలుపుతూ, ఉద్యోగ అవకాశాలు దక్కిన ప్రతి ఒక్కరికీ శుభాభినందనలు తెలిపారు. అనంతరం ఎన్నికైన అభ్యర్థులకు ఆఫర్ లెటర్లను అందజేశారు. ఈ కార్యక్రమంలో కళాశాల ఇన్చార్జి రమేష్, ప్లేస్మెంట్ సెల్ ఆఫీసర్ శ్రీనివాస్, అకడమిక్ ఇన్చార్జి కృష్ణయ్య, అధ్యాపక బృందం విద్యార్థులు పాల్గొన్నారు.
జాబ్ మేళా ఉద్యోగాలకు 48 మంది ఎంపిక..
- Advertisement -
RELATED ARTICLES


