విశాలాంధ్ర ధర్మవరం;; పట్టణంలోని కాయగూరల మార్కెట్ వద్ద గల రోటరీ క్లబ్ మహాత్మా గాంధీ పార్కును, తదుపరి రోటరీ క్లబ్ కార్యాలయాన్ని రోటరీ క్లబ్ డిజి రవీంద్ర, వేద, అసిస్టెంట్ గవర్నర్ సుమంత్ సందర్శించారు. ఈ సందర్భంగా రోటరీ క్లబ్ కార్యాలయంలో పలు రికార్డులను వారు పరిశీలించారు. అనంతరం క్లబ్ ద్వారా చేపడుతున్న వివిధ సేవా కార్యక్రమాలను అడిగి తెలుసుకున్నారు. తదుపరి సమావేశాన్ని నిర్వహించి రోటరీ క్లబ్ సేవలను మరింత విస్తృత పరిచాలని క్లబ్ సభ్యులకు వారు సూచించారు. అదేవిధంగా రోటరీ క్లబ్ పార్క్ అధ్యక్షులు రత్నశేఖర్ రెడ్డి కి ఇంటర్నేషనల్ అవార్డు ప్రధానం చేసి ,ఘనంగా సత్కరించారు. తదుపరి రోటరీ క్లబ్ సీనియర్ మెంబర్ నరేందర్ రెడ్డి కు అవార్డు రావడం పట్ల, వారిని అభినందించి శుభాకాంక్షలు తెలియజేశారు. రోటరీ క్లబ్ ద్వారా వివిధ సేవలందించడం, పార్కును ఏర్పాటు చేయడం నిజంగా గర్వించదగ్గ విషయము అని వారు తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు. అనంతరం పార్కులో డీజీతోపాటు అసిస్టెంట్ గవర్నర్లు మొక్కలను నాటారు.ఈ కార్యక్రమంలో రోటరీ క్లబ్ మహాత్మా గాంధీ పార్క్ కార్యదర్శి శ్రీనివాస్ రెడ్డి, రోటరీ క్లబ్ అధ్యక్షుడు నాగభూషణం, సభ్యులు ప్రసన్నకుమార్, షోలి గాళ్ళవెంకటేష్, కొండయ్య, శివయ్య, గట్టు హరినాథ్, జయసింహ, పెద్దారెడ్డి, చంద్రశేఖర్, బండారు వెంకటచలం, పెరుమాళ్ళ దాస్ తదితరులు పాల్గొన్నారు.
రోటరీ క్లబ్ డిజి, అసిస్టెంట్ గవర్నర్ సుమంత్ సందర్శన
- Advertisement -
RELATED ARTICLES


