Homeజిల్లాలుశ్రీ సత్యసాయిమూగజీవాలను హింసించరాదు. ప్రేమను పంచాలి..

మూగజీవాలను హింసించరాదు. ప్రేమను పంచాలి..

- Advertisement -

పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ
విశాలాంధ్ర ధర్మవరం;; మూగజీవాలను హింసించరాదని, వాటిని కూడా భుజించడం తప్పు అని, వాటితో ప్రేమను పంచుకోవాలని పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ నిర్వాహకులు తెలిపారు. ఈ సందర్భంగా పట్టణములో శాకాహారం ముద్దు మాంసాహారం వద్దు అన్న నినాదంతో పట్టణములో పలు కూడలిలలో ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో దాదాపు 500 మందికి పైగా మహిళలు పురుషులు, విద్యార్థులు పాల్గొని ర్యాలీని విజయవంతం చేశారు. కరపత్రాలను ర్యాలీలో వచ్చిన ప్రజలందరికీ కూడా పంపిణీ చేస్తూ, ర్యాలీ విషయాన్ని తెలియజేశారు. అంతేకాకుండా ధ్యానం కూడా నేటి సమాజంలో మనిషికి ఎంతో అవసరం అన్నారు. ధ్యానముతో చక్కటి ఆరోగ్యం మనశ్శాంతి లభిస్తుందని తెలిపారు. విశ్వ శక్తి ఆవాహన అనేది ధ్యానం ద్వారా మాత్రమే సాధ్యమవుతుందని తెలిపారు. ముఖ్యంగా విద్యార్థులకు పరీక్షల భయం ఒత్తిడి కూడా తగ్గిపోతుందని తెలిపారు. ఈ ధ్యానం వలన మానవ జీవితం సుఖశాంతులతో ఆనందమయం అవుతుందని తెలిపారు. ధ్యానం ద్వారా మాత్రమే జ్ఞానం వస్తుందని జ్ఞానం ద్వారా మాత్రమే మోక్షం వస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో వందల సంఖ్యలో ప్రజలు, పిరమిడ్ నిర్వాహకులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు