సిడిపిఓ లక్ష్మి, ప్రిన్సిపాల్ ప్రభాకర్ రెడ్డి
విశాలాంధ్ర ధర్మవరం : బాల్య వివాహాలు చెట్టరీత్య నేరమని సిడిపిఓ లక్ష్మి, ఏహెచ్ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ ప్రభాకర్ రెడ్డి, చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్ మురళి తెలిపారు. ఈ సందర్భంగా కళాశాలలో బాల్యవివాహాలపై అక్కడి విద్యార్థులకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ బాల్యవివాహాలు చట్టరీత్యా నేరమని, అందుకు తగిన శిక్ష కూడా ఉంటుందని తెలిపారు. బాల్య వివాహాలు ఎక్కడైనా జరుగుతున్న విషయం తెలిసిన యెడల వెంటనే పోలీసులకు గాని, ఐ సి టి ఎస్ కు గాని తెలపాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడి టీచర్లు, సూపర్వైజర్ శైలజ, ఏఎస్ఐ డోనాసింగ్, కళాశాల విద్యార్థులు, పోలీస్ పాల్గొన్నారు.
బాల్య వివాహాలు చట్టరీత్యా నేరం..
- Advertisement -
RELATED ARTICLES


