విశాలాంధ్ర – ధర్మవరం : పట్టణంలోని తేరు బజార్లో గల ఆర్యవైశ్య కొత్త సత్రంలో గోదా రంగనాథ స్వామి కళ్యాణ మహోత్సవ వేడుకలు శ్రీరామ భజన మందిరం ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు కోటి లక్ష్మీ వెంకటేశ్వర్లు, దేవత కృష్ణమూర్తి మాట్లాడుతూ ప్రతి సంవత్సరము ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని, దైవ ఆశీస్సులు లేనిదే ఏ పని జరగదని తెలిపారు. అదేవిధంగా రాష్ట్రం సుభిక్షంగా సుఖశాంతులతో ఉండాలన్న తలుపుతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించామన్నారు. అర్చకులచే తొలుత ఉత్సవ విగ్రహాలకు ప్రత్యేక పూజలు నిర్వహించి, గంగపూజ, కలశ స్థాపన ,విరాట్ ఉత్సవము, ఎదురుకోళ్ళు, దీపోత్సవం, పూలదండల ఆట తో వివాహం అత్యంత వైభవంగా నిర్వహించడం జరిగిందన్నారు. అర్చకుల వేదమంత్రాలు మంగళ వాయిద్యాలు నడుమ పండుగ వాతావరణంలో నిర్వహించడం జరిగిందని తెలిపారు. అనంతరం దాదాపు 2000 మంది ఈ కార్యక్రమానికి భక్తాదులు హాజరు కావడం జరిగిందని, వీరందరికీ పూజల అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని కూడా నిర్వహించామని తెలిపారు. తదుపరి సాయంత్రం వివాహం కాని యువతి ,యువకులకు కంకణ కార్యక్రమాన్ని కూడా నిర్వహించడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో దేవతా శ్రీనివాస్, సంజీవరాయుడు, గోవిందు రంగనాయకులు, నారాయణస్వామి, సుబ్రహ్మణ్యం, గీతా సుహాసిని, శశికళ, భారతి, అనిత తదితరులు పాల్గొన్నారు.
ఘనంగా గోదా రంగనాథ స్వామి కళ్యాణ మహోత్సవ వేడుకలు
- Advertisement -
RELATED ARTICLES


