Homeజిల్లాలుఅనంతపురంఅంగరంగ వైభవంగా పెద్దమ్మ మారెమ్మ వార్షికోత్సవం

అంగరంగ వైభవంగా పెద్దమ్మ మారెమ్మ వార్షికోత్సవం

- Advertisement -

విశాలాంధ్ర-రాప్తాడు : మండల కేంద్రంలో కోరిన కోర్కెలు తీర్చే కొంగుబంగారంగా దశాబ్దాల క్రితం వెలసిన పెద్దమ్మ, మారెమ్మ అమ్మవార్ల దేవాలయం 11వ వార్షికోత్సవం శుక్రవారం అంగరంగ వైభవంగా జరిగింది. అమ్మవారి విగ్రహాలను పూజారి ఓబులయ్య ఉదయాన్నే పూలతో అలంకరణ చేశారు. భక్తులు, ప్రజలు పెద్ద ఎత్తున హాజరై ఫల, పుష్పాలు, కాయకర్పూరం సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. దేవాలయ ప్రాంగణంలో భక్తులకు అన్నం వితరణ కార్యక్రమం చేశారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు