అరకు సీఐ హిమగిరి..
విశాలాంధ్ర- డుంబ్రిగుడ : మత్తు పదార్థాలకు యువత దూరంగా ఉండాలని అరకు సీఐ హిమగిరి అన్నారు. మండల కేంద్రంలోని ఏకలవ్య కళాశాల, పాఠశాల విద్యార్థిని, విద్యార్థులకు గంజాయి పరివర్తన కార్యక్రమంలో భాగంగా మహిళలపై జరిగే అత్యాచారాలు, సైబర్ నేరాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నేటి యువత మత్తు పదార్థాలకు బానిసై వారి వారి ఆరోగ్యాన్ని చిత్తు చేసుకుంటున్నారని చెప్పారు. అనేక మంది యువత గంజాయి వంటి మాదకద్రవ్యాలకు బానిసై వారి బంగారు భవిష్యత్తుతో పాటు వారి వారి కుటుంబాన్ని కూడా దూరంగా ఉండి వారి జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారని చెప్పారు. గంజాయి పండించడంతోపాటు సేవించడం కూడా నేరమని, గంజాయి రవాణా చేయడం కూడా చట్టరీత్యా నేరమని అటువంటి వారిపై కఠినమైన చర్యలతో పాటు జైలు శిక్ష కూడా విధించడం జరుగుతుందని చెప్పారు. ప్రతి ఒక్క యువత చెడు మార్గాలు వదిలేసి సన్మార్గంలో నడిచి వారు బంగారు భవిష్యత్తును వారి ఎంచుకోవాలని చెప్పారు. ప్రతి విద్యార్థి తల్లితండ్రుల ఆశయాలను సాధించేందుకు ప్రతి ఒక్కరు విద్యపై దృష్టి పెట్టి ఉన్నత స్థాయికి ఎదగాలని చెప్పారు. నేటి సమాజంలో మహిళలపై జరిగే అత్యాచారాలు, సైబర్ నేరల గురించి పూర్తిగా వివరించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎస్సై సురేష్ పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.


