Homeజిల్లాలుఅనంతపురంనాణ్యమైన సేవలే లక్ష్యం….

నాణ్యమైన సేవలే లక్ష్యం….

- Advertisement -

నకిలీ ఆధార్ నమోదుపై కఠిన చర్యలు తప్పవు…
జిల్లా కలెక్టర్ ఓ .ఆనంద్ హెచ్చరిక
విశాలాంధ్ర అనంతపురం టౌన్ : ఆధార్ కేంద్రం ద్వారా ప్రజలకు నాణ్యమైన సేవలే లక్ష్యంగా పారదర్శకంగా, వేగవంతంగా అన్నిరకాలసేవలుఅందించాలని జిల్లా కలెక్టర్ ఓ .ఆనంద్ సూచించారు.
బుధవారం అనంతపురం నగరంలోని ఆర్టీసీ బస్టాండ్ వెనుక వైపు చంద్రా హాస్పిటల్ పక్కన పి. ఆర్. రెసిడెన్సి భవనంలోనూతనంగాఏర్పాటు చేసిన ఆధార్ నమోదు కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ముఖ్యంగా ప్రజలకు,వృద్ధులు ,మహిళలు విద్యార్థులకు మరియు గ్రామీణ ప్రాంతాల వారికి ఆధార్ సేవలను బాధ్యతాయుతంగా అందించాలని తెలిపారు. ఎవరైనా తప్పుడు ధ్రువీకరణ పత్రాల తో నకిలీ ఆధార్నమోదుకుప్రయత్నించినప్పుడు అట్టివారిని గుర్తించి
ఆ కేసులను తన దృష్టికి తీసుకురావాలని అలాంటి వారిపై చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ హెచ్చరించారు. ప్రస్తుతం ఈ కేంద్రం ఏర్పాటు వలన ఆధార్ సేవల కోసం ఇతర నగరాలకు వెళ్లాల్సిన అవసరం ఉండదని జిల్లా కలెక్టర్ స్పష్టం చేశారు.
అత్యాధునిక డిజిటల్ సేవలు ఇకపై అనంతపురం నగరంలోని ఈ కేంద్రంలో ప్రజలకు చేరువగా ఉంటాయని తెలిపారు. విజయవాడ,వైజాగ్,కాకినాడ, మచిలీపట్నం, ప్రకాశం వంటి నగరాల్లో అందించే విధంగా ఈ ప్రాంత ప్రజలకు కూడా ఆధార్ సేవలు విస్తరించబ
డినందున ప్రజలు ఈ సేవలను పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకోవాలని పేర్కొన్నారు.
ఉదయం 9:30 గం”ల నుండి సాయంత్రం 5.30 గం” ల వరకు ఈకేంద్రంపనిచేస్తుందని ముఖ్య పండుగ రోజుల్లో తప్పమిగతా దినాలలో ఎలాంటి సెలవులు లేకుండా ప్రజలకు అందుబాటులో ఈ కేంద్రం ఉంటుందన్నారు.
ప్రస్తుత ఈ ఆధార్ కేంద్రంలో కొత్త ఆధార్ నమోదు, మొబైల్ నంబర్ లింకింగ్ ,
చిరునామా మార్పు మరియు బయోమెట్రిక్ అప్డేట్లు వంటి అన్ని రకాల సేవలు లభిస్తాయని తెలిపారు. అనంతపురం నగరంలో ప్రజలకు అనుకూలమైన ప్రాంతంలో ప్రస్తుత యుఐడిఎఐ ఆధార్ సేవలను ప్రజలకు చేరుగా చేయడంలో కృషిచేసిన అధికారులకు జిల్లా కలెక్టర్అభినందించారు. ఆధార్ కేంద్రానికి వచ్చే సందర్శకులను మర్యాదగా మాట్లాడి వారి ఇబ్బందులను గుర్తించి ఎలాంటి సమస్యలు లేకుండా అత్యంత మెరుగైన మరియు పారదర్శకమైన సేవలు అందించాలని కేంద్ర నిర్వాహకులకు సిబ్బందికి జిల్లా కలెక్టర్ సూచించారు. అనంతరం హెల్ప్ డెస్క్, టోకన్ విభాగాలు మరియు ఆధార్ నమోదు కౌంటర్లను జిల్లా కలెక్టర్ పరిశీలించారు. అలాగే ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ తన ఆధార్ అప్డేట్ ను పరిశీలించుకున్నారు.
ఈ కార్యక్రమంలో యు ఐ డి ఎ ఐ పర్యవేక్షణ అధికారి జావీద్, ప్రోటీన్ టెక్నాలజీస్ సంస్థ రీజనల్ మేనేజర్ మహదేవ్ ,ఆపరేషన్ మేనేజర్ ప్రసాద్,అనంతపురం తాసిల్దార్ రాజా, త్రీ టౌన్ ఎస్ఐ నరసింహులు, ఆధార్ కేంద్రం ఉద్యోగ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు