విశాలాంధ్ర ధర్మవరం ; రెవెన్యూ డివిజన్ పరిధిలోని చెన్నై కొత్తపల్లి మండలంలో గల జడ్పీ హైస్కూల్లో రోటరీ క్లబ్ వారు నిర్వహించిన మెడికల్ క్యాంపు అనూహ్య స్పందన రావడం జరిగిందని రోటరీ క్లబ్ అధ్యక్షులు జయసింహ తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ ఈ క్యాంపు గండికోట హాస్పిటల్ యజమాని డాక్టర్ రాజశేఖర్ రెడ్డి సహాయ సహకారములతో నిర్వహించడం జరిగిందని తెలిపారు. మహిళలకు డాక్టర్ దుర్గ ప్రత్యేకంగా పరీక్షలు నిర్వహించి ఉచితంగా వైద్య చికిత్సలతో పాటు మందులను కూడా పంపిణీ చేయడం జరిగిందని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో సత్రశాల ప్రసన్నకుమార్, సోలిగాల వెంకటేశులు చంద్రశేఖర్, పెద్దారెడ్డి, శెట్టిపి రామిరెడ్డి, లక్ష్మయ్య, గండికోట హాస్పటల్ సిబ్బంది పాల్గొన్నారు.
మెడికల్ క్యాంపుకు విశేష స్పందన
- Advertisement -
RELATED ARTICLES


