వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోమారు రెచ్చిపోయారు. యుద్ధం ముగియాలంటే ఇరాన్ లొంగిపోవాల్సిందేనని ప్రకటించారు. రెండు దేశాల మధ్య చర్యలలో ప్రతిష్ఠంభనపై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తంచేశారు. వాళ్లు శాంతి పతాకం ఎగురవేయాల్సిందే అని ఓ ఇంటర్వ్యూలో ట్రంప్ చెప్పారు. తమకు అడొస్తే ఒమన్‌పై బాంబుల వర్షం కురిపిస్తామని, నామ రూపాలు లేకుండా చేస్తామని హెచ్చరికలు చేశారు. హోర్మూజ్ జల సంధిలో వాణిజ్య నౌకాయానాన్ని పునరుద్ధరించడంపై ఒమన్, ఇరాన్ మధ్య ఒప్పందం దిశగా చర్యలు కొనసాగుతున్న నేపథ్యంలో ట్రంప్ తీవ్రంగా స్పందించారు. మిడ్ టర్మ్ ఎన్నికలు ఉన్నప్పటికీ ఇరాన్ వ్యూహాంలో ఏ మార్పు ఉండదని, దీని ప్రభావం ఎన్నికలపై ఉండబోదని అన్నారు. ఇరాన్ అణుశక్తి కాకూడదన్నదే తన నంబర్ లక్ష్యమని, అది శాశ్వత లక్ష్యం కూడా అని చెప్పారు. ఏ రూపంలోనూ, ఏ విధంగా ఇరాన్ దేశం అణ్వస్త్రాలు కలిగివుండేందుకు అంగీకరించబోమని డొనాల్డ్ ట్రంప్ పునరుద్ఘాటించారు.
ట్రంప్ అణు దాడి వ్యూహాన్ని అడ్డుకోండి: రిపబ్లికన్ నేత
‘ఇరాన్‌పై అణు దాడులకు ట్రంప్ సర్కారు రహస్యంగా సన్నద్ధమవుతోంది. ఇప్పటికే ప్రణాళికలు రూపొందించే పనిలో నిమగ్నమైంది. ఉన్నతస్థాయి చర్చలు, సంప్రదింపుల ద్వారా వ్యూహాత్మకంగా ముందుకెళుతోంది. అణు దాడులు జరిగితే మాత్రం ప్రపంచం ఆర్థిక మాంద్యంలో కూరుకుపోయే ముప్పు ఉంది’ అంటూ అమెరికా కాంగ్రెస్ మాజీ సభ్యులు, రిపబ్లికన్ పార్టీ నాయకురాలు మర్జోరీ టేలర్ గ్రీన్ సంచలన వ్యాUయూలు చేశారు. ట్రంప్ చర్యలను అడ్డుకోవాలని ప్రజలకు టేలర్ గ్రీన్ పిలుపునిచ్చారు. 1945లో హిరోషిమా, నాగసాకిపై అణు దాడి, అనంతరం పరిణామాలు, నేటికీ మానని గాయాలను గుర్తుచేశారు. ఇరాన్‌కూ జపాన్ గతే పట్టవచ్చని హెచ్చరించారు.
ట్రంప్‌కు ఎర్దోగన్ ఫోన్
యుద్ధం ముగించే దిశగా చర్చల్లో పురోగతి కోసం కృషి చేయాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను టర్కీ అధ్యక్షుడు తయ్యిప్ ఎర్దోగన్ పిలుపునిచ్చారు. ఇదే అంశంపై ఫోన్ సంభాషణ జరిపారు. శాంతి ప్రక్రియలో తమ వంతు తోడ్పాటు అందించేందుకు సిద్ధమని, యుద్ధాన్ని సాధ్యమైనంత త్వరగా ముగించాలని మరోమారు కోరారు.
ఇరాన్ లొంగిపోవాల్సిందేఅడ్డొస్తే ఒమన్‌పై బాంబులు: ట్రంప్
- Advertisement -
RELATED ARTICLES


