Homeజిల్లాలుఅనంతపురంస్వచ్ఛతే సేవలో నీటి సంరక్షణపై అవగాహన

స్వచ్ఛతే సేవలో నీటి సంరక్షణపై అవగాహన

- Advertisement -

విశాలాంధ్ర, ఉరవకొండ: స్థానిక అంబేద్కర్‌ గురుకుల పాఠశాలలో స్వచ్ఛత హీ సేవ కార్యక్రమంలో భాగంగా శుక్రవారం ‘వర్షపు నీటి సంరక్షణ–నీటి నిర్వహణ’పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్‌ జ్ఞాన ప్రసూన మాట్లాడుతూ నీటిని పొదుపుగా వినియోగించి భవిష్యత్‌ తరాలకు అందుబాటులో ఉండేలా సంరక్షించాలని సూచించారు. భోజనానికి ముందు, తర్వాత చేతులు శుభ్రంగా కడుక్కోవాలని, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని తెలిపారు. సచివాలయ ఇంజినీరింగ్‌ అసిస్టెంట్లు మంజు, వినోద్‌, రవీంద్ర వాటర్‌ టెస్టింగ్‌ కిట్లతో విద్యార్థినులకు నీటి నాణ్యత పరీక్షలను ప్రదర్శించారు. స్కూల్‌ కమిటీ చైర్మన్‌ హరిష్‌ వ్యక్తిగత పరిశుభ్రత, నీటి పొదుపుపై అవగాహన కల్పించారు. మంత్రి పయ్యావుల కేశవ్‌ కృషితో పాఠశాలకు ప్రతిరోజూ తాగునీరు అందుతున్నందున నీటిని సక్రమంగా వినియోగించుకోవాలని సూచించారు. భాగ్యలక్ష్మి టీచర్‌ ఆధ్వర్యంలో విద్యార్థినులతో స్వచ్ఛతే సేవ ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు కీర్తి, కుళ్లాయమ్మ, ఉదయకుమారి, సచివాలయ సిబ్బంది అశోక్‌, సందీప్‌, పంచాయతీ అభివృద్ధి అధికారులు, స్వచ్ఛ భారత్‌ మండల కోఆర్డినేటర్‌ ఎం.జయప్రకాష్‌ గౌడ్‌, 8, 9 తరగతుల విద్యార్థినులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు