Homeజిల్లాలుఅనంతపురంఆర్థిక ఇబ్బందులతో వ్యక్తి ఆత్మహత్య...

ఆర్థిక ఇబ్బందులతో వ్యక్తి ఆత్మహత్య…

- Advertisement -

విశాలాంధ్ర – కళ్యాణదుర్గం టౌన్: కళ్యాణదుర్గం మండలంలోని దాసంపల్లి గ్రామంలో ఆర్థిక సమస్యలతో ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన విషాదం నింపింది. గ్రామానికి చెందిన శ్రీనివాస్‌రెడ్డి (46) తన ఇంట్లో ఉరేసుకుని మృతి చెందినట్లు సమాచారం.ఆర్థిక ఇబ్బందుల కారణంగానే ఆయన ఈ అఘాయిత్యానికి పాల్పడి ఉండవచ్చని స్థానికులు చెబుతున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించినట్లు తెలిసింది.ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సమాచారం. శ్రీనివాస్‌రెడ్డి ఆత్మహత్యకు గల పూర్తి కారణాలు పోలీసుల దర్యాప్తులో వెల్లడికావాల్సి ఉంది.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు